
Patanjali Education Programme: ఆయుర్వేదం, యోగ పై ప్రత్యేక ఆదరణ పొందిన పతాంజలి విద్యా కార్యక్రమాలు చేపట్టి పేద పిల్లల భవిష్యత్తును కూడా రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యారంగంలో అపారమైన కృషిచేసి పతాంజలి గురుకులం, పతాంజలి ఆచార్యకులం, పతాంజలి పతాంజలి విశ్వవిద్యాలయంలాంటి సంస్థలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక విద్యను కూడా అందిస్తుంది.
ఈ పతాంజలి విద్యాసంస్థల్లో విద్యార్థులకు రెండు రకాల విద్యలను నేర్పుతుంది. వేదం జ్ఞానంతో పాటు ఆధునిక విద్యను కూడా వాళ్లకు అందిస్తూ అభివృద్ధి బాటలో వెళ్లేలా చేస్తుంది. ఈ పతాంజలి అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా పిల్లల భవిష్యత్తును ఎంతో మంచి బంగారు బాటలు వేసేలా చేస్తోంది.
పతాంజలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలు, పేద పిల్లలకు మంచి ప్రయోజనాలు అందిస్తోంది. మెరుగైన విద్యను వాళ్లకు అందిస్తూ ఈ పోటీ ప్రపంచంలో వాళ్లకు మంచి విద్యను అందిస్తుంది. 2020-21 పతాంజలి డేటా ప్రకారం ఆచార్య కులం పాఠశాలకు రూ.4.21 కోట్ల ఖర్చు చేసింది. ప్రధానంగా ఈ ఆచార్యకులం పాఠశాలలు సీబీఎస్ఈ ద్వారా గుర్తించినవి అంటే ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ విద్యనే అందిస్తున్నాయి.
ప్రధానంగా ఈ పతాంజలి ఆచార్య కులం హరిద్వార్‌లోని శివాలిక్ శ్రేణి సమీపంలో ఉన్నాయి. పిల్లలకు వేద జ్ఙానంతో ఆధునిక విద్యను కూడా అందిస్తూ వాళ్లకు హాస్టల్ సదుపాయాలు కూడా కల్పిస్తోంది. ఇక గురుకులంలో వేదాలు, పురాణాలు, భారతీయ సంస్కృతి ఆధునిక అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పతాంజలి మంచి విద్యను అందిస్తూ వాళ్లకి అభివృద్ధి బాటలు వేస్తోంది.
పతాంజలి దృష్టి ప్రధానంగా విద్య, ఆరోగ్యం పై ప్రాధాన్యత చూపిస్తుంది . దీనివల్ల పేద పిల్లలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారు. 2025లో పతాంజలి 30వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోనుంది. దీనిపై బాబా రాందేవ్ మాట్లాడుతూ విద్యారంగంలో పతాంజలి పెద్ద మార్పు తీసుకురాబోతుందని పిల్లలు నాణ్యమైన విద్యను అతి తక్కువ ధరలోనే పొందుతారని చెప్పారు.
ఇక పతాంజలి దేశవ్యాప్తంగా 500 కు పైగా ఆచార్య కులం పాఠశాలలను ప్రారంభించే దిశ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ నేపథ్యంలో పేద పిల్లలకు మంచి విద్య అందుతుంది. పిల్లలకు మెరుగైన విద్య అందిస్తూ వాళ్లకు ఈ ఆధునిక కాలంలో వేదాలను బోధిస్తూ ఆధునిక పోకడలకు అనుకూలంగా విద్యను నేర్పుతూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది పతాంజలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి