Patanjali Mega Food and Herbal Park:
నాగ్‌పూర్‌లోని మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ & ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పతంజలి మెగా ఫుడ్ & హర్బల్ పార్క్ మార్చి 9, 2025 నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ఫుడ్ పార్క్‌కు 2016 సెప్టెంబర్‌లో శంకుస్థాపన జరిపారు.
ఈ ఫుడ్ పార్క్ ప్రత్యేకంగా సిట్రస్ పండ్ల ప్రాసెసింగ్ కోసం రూపుదిద్దుకుంది. నారింజ, ముసంబి, నిమ్మ వంటి పండ్లను రోజుకు 800 టన్నులు ప్రాసెస్ చేయనున్నారు. ఇవి జ్యూస్, పల్ప్, ప్యూరీ, కాన్సన్‌ట్రేట్ రూపంలో మారుస్తారు. మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి, స్ట్రాబెర్రీ, టమోటా, క్యారెట్ వంటి పండ్లు, కూరగాయలను కూడా ప్రాసెస్ చేయనున్నారు.
ఇక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రసాయనాలు లేకుండా నేచురల్ ఉత్పత్తులను తయారు చేస్తారు. సిట్రస్ పండ్ల మిగతా భాగాలను అరోమా ఆయిల్, వాటర్-బేస్డ్ ప్రొడక్ట్స్ తయారీకి వాడతారు. రైతుల వద్ద నుంచి ప్రత్యక్షంగా పంట కొనుగోలు చేయడం వల్ల వారి ఆదాయం పెరుగుతుంది. ఈ మెగా ఫుడ్ పార్క్ రైతులకు మాత్రమే కాకుండా యువతకు పెద్ద స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ప్రారంభ దశలోనే 500 మందికి ఉద్యోగాలు కల్పించగా, భవిష్యత్‌లో 10,000 మందికి ఉపాధి లభించనుంది.
ఈ పార్క్‌లో ఆధునిక యంత్రాలతో పండ్ల ప్రాసెసింగ్ జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. రైతులకు కూడా ఇది చాలా ప్రయోజనకరం. పతంజలి ప్రత్యక్షంగా వారి పంట కొనుగోలు చేయడం ద్వారా వారికి మంచి ధర లభిస్తుంది. అలాగే సేంద్రియ వ్యవసాయం, మట్టికి సంబంధించిన పరీక్షలు చేయడానికి సహాయపడుతుంది.
ఈ మెగా ఫుడ్ పార్క్ నాగ్‌పూర్, విదర్భ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవ్వడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే ఈ మెగా ఫుడ్ పార్క్ చివరి దశకు చేరుకుంది. దీని కోసం ₹700 కోట్ల పెట్టుబడి ఖర్చు చేశారు. మొత్తం ప్రాజెక్ట్ ₹1500 కోట్ల వరకు విస్తరించనున్నారు.
ఈ ఫుడ్ పార్క్ భారతదేశంలోనే ఒక ప్రధాన ప్రాసెసింగ్ కేంద్రంగా మారనుంది. ఇందులో జ్యూస్, పల్ప్, పేస్ట్, కాన్సన్‌ట్రేట్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు. నాగ్‌పూర్ ప్రసిద్ధ నారింజల ప్రాసెసింగ్ యూనిట్ దీనిలో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. కేవలం సిట్రస్ పండ్లు కాకుండా మామిడి, దానిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, టమోటా, క్యారెట్ వంటి పండ్లను ప్రాసెస్ చేయనున్నారు. అంతేగాక అత్యాధునిక ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు.
ఈ పెట్టుబడి వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని అంటున్నారు. రైతులు పతంజలి ద్వారా నేరుగా తమ పంటను అమ్ముకోవడం ద్వారా మంచి లాభాలు పొందనున్నారు. అలాగే సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల పర్యావరణానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. ఈ మెగా ఫుడ్ పార్క్ ద్వారా విదర్భను పారిశ్రామిక కేంద్రంగా మార్చాలని పతంజలి లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కొత్త గాలిని తీసుకొచ్చే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









