Patanjali Research Institute: పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆయుర్వేదంపై ఎన్నో పరిశోధనలు చేస్తోంది. అంతేకాదు ఎన్నో అద్బుత ఆవిష్కరణలతో ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు అపౌరుషేల్లో నాలుగు వేదాల్లో చివరి వేదమైన అధర్వణ వేదంలో ఉప వేదం ఆయుర్వేదం. పురాతన జ్ఞానాన్ని ఈ రోజుల్లో ఉన్న శాస్త్రంతో కలపడానికి ప్రయత్నిస్తోంది పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. కేవలం ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు.. ప్రపంచంలోని ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పాటు పడుతోంది. అదేవిధంగా, పతంజలి పురాతన ఆయుర్వేద చికిత్సలను ఆధునిక శాస్త్రంతో కలిపి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ముందుంది.
ఆయుర్వేదం అనేది భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉపయోగపడుతున్న ఔషధ పద్ధతి. అయితే, పతంజలి ఈ పద్ధతిని భారతీయుల మధ్య మాత్రమే పరిమితం చేయాలనుకోవడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చేరువయ్యేలా చేస్తోంది. పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ 2017లో హరిద్వార్లో ఎలాంటి లాభాపేక్షా లేకుండా పరిశోధనా సంస్థగా స్థాపించబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఆయుర్వేదాన్ని శాస్త్రీయ పద్ధతిలో పరిశోధించడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే. పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 300 మందికి పైగా శాస్త్రజ్ఞులు పగలు రాత్రి పని చేస్తున్నారు. ఈ శాస్త్రజ్ఞులు పురాతన ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించి, ఔషధ మొక్కలపై పరిశోధన చేస్తున్నారు. ఆ మొక్కలు నిజంగా పనిచేస్తాయా లేదా అన్నది ల్యాబ్‌లో పరీక్షించి మరి ఈ పతంజలి ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేస్తున్నారు.
పురాతన ఆయుర్వేదం మరియు ఆధునిక శాస్త్రం అనుసంధానం చేస్తున్నారు.
పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ కేవలం పురాతన ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రేరేపించడం మాత్రమే కాదు.. దానిని ఆధునిక సాంకేతికత, శాస్త్రంతో కలిపి పని చేస్తోంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆయుర్వేద చికిత్సలు వారి భాషలో అందించడమే. ఈ ఆలోచన మేరకు, పతంజలి గార్డన్‌లో 1000కి పైగా అరుదైన ఔషధ మొక్కలు నాటబడ్డాయి. వీటిలో చాలా మొక్కలు గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. ఈ ఔషధ మొక్కలపై ఆధునిక శాస్త్రంతో పరిశోధన జరుగుతుంది. దీని ద్వారా కొత్తగా ప్రభావవంతమైన చికిత్స పద్ధతులను కనుగొనడం ద్వారా వైద్య రంగంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు.
శాస్త్రీయ పరీక్షలు ప్రజల విశ్వాసాన్ని పెంచాయి..
ఆయుర్వేదం ఒక పురాతన చికిత్స పద్ధతి. అయితే ఇప్పుడల్లా ప్రజలలో దీపై విశ్వాసం పెరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించినది పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఎందుకంటే, పతంజలి సహజసిద్దమైన సురక్షిత పదార్థాలతో తయారు చేసిన ఔషధాలతో ప్రజలను చికిత్స అందిస్తోంది. ఈ ఔషధాలు శాస్త్రీయంగా పరీక్షించిన తర్వాత మాత్రమే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు.
పతంజలి ఉత్పత్తుల ప్రత్యేకత ఏమిటంటే, అవి సహజ సిద్దమైన ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఆయుర్వేద మొక్కలతో పాటు సహజ పదార్థాలను ఉపయోగించి, పతంజలి తన ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత వాటిపై శాస్త్రీయ పరీక్షలు కూడా నిరంతరం జరుగుతున్నాయి. దీని ద్వారా ఇవి నమ్మకమైన బ్రాండు గా మారాయి.
పతంజలి యొక్క ప్రతి ఉత్పత్తి సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది.పతంజలి ప్రతి ఉత్పత్తిని పూర్తిగా సురక్షితమైనదిగా చెప్పబడింది. ప్రభావవంతమైనదిగా తయారుచేసేందుకు తన స్వంత ల్యాబ్‌లో పరిశోధన చేస్తుంది. అంతేకాదు ప్రతి క్షణం పర్యవేక్షించబడుతోంది. ఈ ప్రొడక్ట్స్ లో ఎలాంటి రసాయనాలు తన ఔషధాలలో లేకుండా చేస్తారు. ఎందుకంటే ఈ ఔషధాలు పూర్తిగా ఆయుర్వేద మొక్కలు, సహజ పదార్థాలతో తయారుచేయబడతాయి.
ఇక, పతంజలి శాస్త్రజ్ఞులు పురాతన వేదాలు, మహానుభావుల ఇచ్చిన ఆయుర్వేద జ్ఞానాన్ని ఉపయోగించి, ఆయుర్వేద ఉత్పత్తులు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రభుత్వం నిర్ధారించిన ల్యాబ్స్ కూడా పేర్కొన్నాయి. ముఖ్యంగా, ఇది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే పతంజలి యొక్క లక్ష్యం. అలాగే, పతంజలి రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆయుర్వేదం దాని ప్రయోజనాలను అర్థం చేసుకోవడానికి సంస్కృతం, పురాతన లిపులో కూడిన గ్రంథాలను కూడా పరిశీలిస్తుంది.పతంజలి ఆధునిక శాస్త్రంతో ఆయుర్వేదాన్ని ఉపయోగిస్తూ.. శాస్త్రీయ పరిశోధనలు, పరీక్షల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుచడంలో ముందుంది.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









