)
Patna Railway Station Gangraped: మహిళలకు ఏ ప్రదేశంలో కూడా సరైన భద్రత లేదని తెలుస్తోంది. ఎందుకంటే రైలు కోసం వేచి ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. ముందుగా ఆమెకి గన్‌తో బెదిరించి అపహరించారు. పాట్నా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆమె రైలు కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు బైక్ పై ఆమె వద్దకు వచ్చారు. ఆ తర్వాత ఆమెని ఒక పిస్తాల్లో పాయింట్ బ్లాక్ లో గురిపెట్టి అక్కడ నుంచి కిడ్నాప్ చేశారు. దగ్గరలో ఉన్న తమ రూమ్ కి తీసుకెళ్లి ఆ ఇద్దరి యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే అక్కడి నుంచి సదరు యువతీ పారిపోయి వెంటనే పోలీస్ పెట్రోల్ టీమ్‌కు తెలిపింది. కంగారుపడుతూ ఆమె జరిగిన దారుణ ఘటనను పోలీసులకు వివరించింది. వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. అయితే వెంటనే టెక్నికల్ టీమ్ వాళ్ళు ఆ ప్రాంతాన్ని గుర్తించి నిందితులను పట్టుకున్నారు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని పట్టుకోడానికి ప్రయత్నించగా నిందితుల అక్కడి నుంచి పారిపోయారు. వారిని పోలీసులు పట్టుకున్నారు. అయితే మహిళపై అత్యాచార్యడానికి పాల్పడిన వారు సోను కుమార్ యాదవ్ అలియాస్ సోనూ మరొకరు నిరంజన్ అని గుర్తించారు. వారిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇందులో ఇప్పటికే సోనుపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అతనిపై 8 కేసులు నమోదయ్యాయి.. ల్యాండ్ డీలింగ్స్ లో కూడా బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసే బ్యాచ్ అని తెలిసింది. వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ నిఘా ఉండే ఇలాంటి భద్రతాపరమైన ప్రదేశంలో కూడా మహిళలపై ఇలాంటి దారుణ గతంలో చోటు చేసుకోవడంతో మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అయితే రైలు కోసం ఎదురుచూస్తున్న మహిళపై ఇలాంటి ఘటనకు పాల్పడం మరింత దురదృష్టకరం. అంతేకాదు సదరు నిందితుల గన్‌తో హల్చల్ చేసి భయం చేసి మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉండేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.