Petrol Price Today: నేడు ఊరట కలిగించిన పెట్రోలు ధర, Diesel Price, హైదరాబాద్ సహా మెట్రో నగరాలలో లేటెస్ట్ రేట్లు ఇవే

Petrol Price Latest Updates On 24 February 2021: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఎలాంటి ధరలు పెరగలేదు. ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

Written by - Shankar Dukanam | Last Updated : Feb 24, 2021, 10:42 AM IST
  • చమురు ధరలు నేడు వాహనదారులకు స్వల్ప ఊరట కలిగించాయి
  • ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది రెండోసారి
  • ఫిబ్రవరి నెలలో ఇదివరకే 14 రోజులు ఇంధన ధరలు పెరిగాయి
Petrol Price Today: నేడు ఊరట కలిగించిన పెట్రోలు ధర, Diesel Price, హైదరాబాద్ సహా మెట్రో నగరాలలో లేటెస్ట్ రేట్లు ఇవే

Petrol Price Today In Hyderabad 24 February 2021: చమురు ధరలు నేడు వాహనదారులకు స్వల్ప ఊరట కలిగించాయి. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఎలాంటి ధరలు పెరగలేదు. ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

ఫిబ్రవరి నెలలో ఇదివరకే 14 రోజులు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 24 (బుధవారం) నాడు నిన్నటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిన్న పెరిగిన ధరలతో బుధవారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి.

Also Read: BSNL ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీకు Double Data, అన్‌లిమిటెడ్ కాల్స్ సహా మరెన్నో ప్రయోజనాలు

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకారం తాజాగా పెరిగిన ధరలు ఇలా ఉన్నాయి. నిన్న లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, డీజీల్ పై 38 పైసలు పెరగడం తెలిసిందే. దీంతో హైదరాబాద్(Hyderabad)‌లో బుధవారం ఉదయం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.94.54, డీజిల్ ధర రూ.88.69 వద్ద కొనసాగుతున్నాయి.

Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పుంజుకున్న బంగారం ధరలు, ఆల్‌టైమ్ గరిష్టానికి Silver Price

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర తాజాగా రూ.90.93 అయింది. 91 రూపాయలకు కేవలం 7 పైసలు దూరంలో నిలిచింది. డీజిల్ ధర రూ.81.32 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ సెంచరీకి చేరువైంది. ముంబై(Mumbai)లో 1 లీటర్ పెట్రోల్ ధర రూ. 97.34కి చేరగా, డీజిల్ ధర రూ.88.44 అయింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.92.90, డీజిల్ ధర రూ.86.31గా ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News