Platform Ticket Price: ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర ఏకంగా రూ.50కి పెంచారు, కారణమేంటో తెలుసా
Platform Ticket Price Raised To Rs 50 | కొన్ని ముఖ్య స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను పెంచింది. ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచినట్లు ఓ అధికారి మంగళవారం తెలిపారు. జూన్ 15 వరకు పెరిగిన ధర అమలు కానుంది.
Platform Ticket Price Raised To Rs 50: గతేడాది భారీగా కరోనా కేసులు, మరణాలు నమోదు చేసిన మహారాష్ట్రలో గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దాంతో ఈ వేసవి కాలంలో అధిక రద్దీని నివారించడానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (Mumbai Metropolitan Region) లోని కొన్ని ముఖ్య స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను పెంచింది. కోవిడ్-19(COVID-19) మహమ్మారి నేపథ్యంలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచినట్లు ఓ అధికారి మంగళవారం తెలిపారు.
ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ .10 నుంచి ఏకంగా 5 రెట్లు పెంచారు. దాంతో కీలక టర్మినల్స్ వద్ద ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ .50 అయింది. ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్, దాదర్ మరియు లోకమాన్య తిలక్ టెర్మినల్, మరియు పొరుగున ఉన్న థానే, కళ్యాణ్, పన్వెల్ మరియు భివాండి రోడ్ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరలు పెంచినట్లు సిఆర్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శివాజీ సుతార్ తెలిపారు.
Also Read: EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో
ఈ కొత్త ధరలు ఈ ఏడాది జూన్ 15 వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వేసవిలో ఈ స్టేషన్లలో ప్రయాణికుల అధిక రద్దీని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఫిబ్రవరి రెండవ వారం నుండి ముంబై నగరంలో COVID-19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నగరంలో ఇప్పటివరకు 3.25 లక్షలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదు కాగా, 11,400 మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు.
Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో భారీగా దిగొచ్చిన బంగారం ధరలు, Silver Price
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook