PM Internship 2025: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం ఇంటర్న్ షిప్ 2025 ప్రోగ్రామ్ ఇది. అర్హులైనవారికి నెలకు 5 వేల రూపాయలు అందుకోవడమే కాకుండా వర్క్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. విద్యార్ధుల సౌకర్యం కోసం గడువు తేదీని ఇవాళ అంటే మార్చ్ 12 వరకు పొడిగించారు.
పీఎం ఇంటర్న్‌షిప్ 2025 అనేది నిరుద్యోగ విద్యార్ధులకు వివిధ రంగాల్లో వర్క్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పధకం. ఈ పధకంలో వర్స్ ఎక్స్‌పీరియన్స్ అందించడమే కాకుండా నెలకు 5 వేల రూపాయలు ఇంటర్న్ పొందవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు pminternship.mca.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వాస్తవానికి గడువు తేదీ గత నెలతో ముగిసింది. కానీ విద్యార్ధుల సౌకర్యార్ధం మార్చ్ 12 అంటే ఇవాళ్టి వరకూ పొడిగించారు. ఆన్‌లైన్ అప్లికేషన్లు కాబట్టి ఇవాళ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేయవచ్చు. నిరుద్యోగ యువతకు కార్పొరేట్ కంపెనీల్లో ప్రాక్టికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అందించే పథకం ఇది. ఈ పధకంలో ఎంపికైతే నెలకు 5 వేల రూపాయలు ఇన్సెంటివ్ లభిస్తుంది. ఈ ఇంటర్న్‌షిప్ ఏడాది ఉంటుంది. ఇందులో మొదటి ఆరు నెలలు సంబంధిత వృత్తిలో పని ఉంటుంది. తాము చదివిన కోర్సుకు సంబంధించి ప్రాక్టికల్ అనుభవం కోసం అభ్యర్ధులు దరఖాస్తు చేయవచ్చు.
PM Internship Scheme 2025కు అప్లై చేయడం ఎలా
ముందుగా అధికారిక పోర్టల్ pminternship.mca.gov.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీపై కన్పించే రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి అడిగిన వివరాలు ఎంటర్ చేయాలి. పోర్టల్ ద్వారా మీ రెస్యూమ్ క్రియేట్ చేయండి. 5 ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఈ పధకం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్ధులు ఇవాళ రాత్రి వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పథకంలో ఎంపికైతే మీక్కావల్సిన వర్క్ ఎక్స్‌పీరియన్స్ లభించడమే కాకుండా ఏడాది పాటు నెలకు 5 వేల రూపాయలు అందుతాయి.
Also read: Bank Holidays: వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు, ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









