PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పడలేదా? ఫిర్యాదు చేయడం ఎలా? తెలుసుకోండి..

PM Kisan Nidhi Complaint: పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKY)కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. అయితే 19వ విడుత నిధులు ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేశారు. అయితే కొంతమంది రైతులు ఈ నిధులు పొందలేరు వారు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలి తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Feb 26, 2025, 03:49 PM IST
PM Kisan: పీఎం కిసాన్‌ 19వ విడుత నిధులు పడలేదా? ఫిర్యాదు చేయడం ఎలా? తెలుసుకోండి..

PM Kisan Nidhi Complaint: ప్రధానమంత్రి కిసాన్ సమాధి యోజన (PMKY) కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ప్రతి ఏటా మూడు దశల్లో ఈ డబ్బులను రూ.2000 చొప్పున రైతుల ఖాతాలో డీబీటీ ద్వారా జమ చేస్తారు. చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయ పెట్టుబడులకు చేయూతగా ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.  2019లో ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకం ప్రారంభించారు. అప్పటినుంచి రైతులకు ఆర్థికంగా చేయూత అందిస్తుంది.

Add Zee News as a Preferred Source

పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి అధికారిక వెబ్‌సైట్లో నేరుగా ఈ రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి కేవైసీ కూడా ముందుగానే పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డు, బ్యాంకు కార్డు లింక్ అయి ఉండాలి.. భూ రికార్డులు కూడా సరిగ్గా ఉంటేనే పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతారు.  అయితే 2024 అక్టోబర్ 5వ తేదీన 18వ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. తాజాగా 2025 ఫిబ్రవరి 24వ తేదీన 19వ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.

ఈ కేంద్ర ప్రభుత్వ యోజన ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే కొంతమంది రైతులకు ఈ డబ్బులు పడలేదు. కేవైసీ చేసుకోకపోవడం.. దీనికి మరిన్ని కారణాలు కూడా కావచ్చు. అయితే అలాంటి రైతులు కూడా పిఎం కిసాన్ నిధులు ఫిర్యాదు చేసుకోవచ్చు. దీనికి హెల్ప్ లైన్ లేదా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  Anjeer: అంజీర్‌ పండును 2 ఇలా వాడితే.. ఏ పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు..

పిఎం కిసాన్ నిధులు పొందలేని రైతుల 180015526 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు నేరుగా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 175261 నంబర్ కి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ ఉదయం 6 గంటలకు 10 గంటల వరకు ఫిర్యాదులు తీసుకుంటుంది. ఇక మీరు ఆన్లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి అనుకుంటే Pmkisan-ict@gov.in మెయిల్ పంపి ఫిర్యాదు చేయవచ్చు.

ఇక ఆన్లైన్ పోర్టల్‌ల్లో పీఎం కిసాన్ ఫిర్యాదు చేసే విధానం ఉంది. దీనికి పిఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో 'ఫార్మర్ కార్నర్' ని క్లిక్ చేయండి. అందులో ఫిర్యాదు కంప్లైంట్స్ బాక్స్ పై క్లిక్ చేసి మీ పిఎం కిసాన్ నిధుల ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఇందులో మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకునే విధానం కల్పించారు. అయితే పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవడంతో పాటు రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీరు కలిగి ఉండాలి. ఇక ఈ అధికారిక వెబ్సైట్లోనే లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకునే చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:  పాడవ్వకూడదని అల్లం వెల్లులి పేస్ట్ ఫ్రిజ్‌లో స్టోర్‌ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News