PM Kisan: రైతులకు బిగ్‌షాక్‌.. పీఎం కిసాన్‌ నుంచి లక్షలాది మంది పేర్లు తొలగింపు? ఇలా చెక్‌ చేసుకోండి..

PM Kisan Farmers Names Deleted List 2025: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 20 విడుదల నిధులు మంజూరయ్యాయి. 21వ విడత నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన నుంచి కొన్ని లక్షలాది మంది రైతుల పేర్లను తొలగించారు. ఎందుకు? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Nov 13, 2025, 10:04 AM IST
PM Kisan: రైతులకు బిగ్‌షాక్‌.. పీఎం కిసాన్‌ నుంచి లక్షలాది మంది పేర్లు తొలగింపు? ఇలా చెక్‌ చేసుకోండి..

PM Kisan Farmers Names Deleted List 2025: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ప్రధానంగా రైతుల కోసం తీసుకువచ్చిన పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన (PMKSY) ఒకటి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. మూడు దశల్లో రూ.2000 విడుదల చేస్తుంది. అలా ఇప్పటివరకు 20 విడుదల నిధులు మంజూరు చేసింది. రైతులు తాజాగా 21వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీపావళి, ఛత్‌పూజ సందర్భంగా ఈ నిధులు విడుదల అవుతాయని వారు ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు మంజూరు కాలేదు.మొదటగా ఈ విడుత నిధులు వరద ప్రభావిత ప్రాంతాలైన కశ్మీర్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో విడుదల చేశారు. తాజాగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ మొదటి వారం లేదా నవంబర్ చివరి వారంలోనే ఈ నిధులు మంజూరు అవుతాయని తెలిసింది. అయితే దీనికి ముందుగానే రైతులు కొన్ని పనులు కూడా పూర్తి చేసుకోవాలి. 

Add Zee News as a Preferred Source

 అయితే నిబంధనను ఉల్లంఘించిన కొన్ని లక్షలాది మంది రైతుల పేర్లను కేంద్రం తొలగించింది. కుటుంబంలో కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. అంతేకాదు పదివేలలోపు పెన్షన్ తీసుకున్నవారు మాత్రమే. ఆదాయపన్ను కట్టే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. వారు ఎలాంటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన 35 లక్షల మంది వరకు పీఎం కిసాన్ లబ్ధిదారుల పేర్లను కేంద్రం తాజాగా తొలగించింది.

 దీంతోపాటు 2019 ఫిబ్రవరి 1 లోపు భూమి తమపేరు ఉన్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ నిధులు మంజూరు అవుతున్నాయి. ఆ తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వారికి ఇంకా నిధులు విడుదల కాలేదు. దానిపై త్వరలో అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లో మీరు స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అయితే కేవైసీ, బ్యాంకు, ఆధార్ లింక్ భూ రికార్డులు సరిగ్లా ఉన్నాయో? లేదో ముందుగానే చెక్ చేసుకోండి.

Pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ లో కూడా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక ఆన్లైన్లో మీ పేరు చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఇది కూడా ఇదే వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. అయితే ముందుగా మీ బ్యాంకుకు డీబీటీ ట్రాన్స్‌ఫర్‌ లింకు కూడా చేసుకోవాలి. లేకపోతే నేరుగా డబ్బులు క్రెడిట్ కావు. అంతేకాదు రిజిస్టర్ మొబైల్ నెంబర్ మెసేజ్ వచ్చే విధంగా అలర్ట్ కూడా పెట్టుకోవాలి. అప్పుడే పీఎం కిసాన్ నిధులు మంజూరు అయినప్పుడు వెంటనే మీ ఫోన్ కి మెసేజ్ అలర్ట్ వస్తుంది.

Read more: ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం.. కారులో ఉన్నది ఎవరో తేల్చిన డీఎన్‌ఏ టెస్ట్‌..! టర్కీతో సంబంధాలు..

Read more: రేపు వైన్‌షాపులు బంద్‌.. కల్లు కంపౌండ్, బార్లు, వైన్స్‌ దుకాణాలు క్లోజ్‌..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News