
PM Kisan 20th Installment date: పీఎం కిసాన్ 20వ విడుత నిధులు ఈనెల 20వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తద్వారా రూ.2000 తమ ఖాతాలో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతుల లబ్ధి పొందుతున్నారు.
ప్రధానంగా ఈ నిధులు వారి వ్యవసాయ పెట్టుబడులకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా నిధులు మంజూరు చేస్తున్నారు. మూడు దశల్లో రూ.2000 చొప్పున ఈ నిధులు రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఇప్పటివరకు 19 విడుత నిధులు మంజూరు చేశారు. ఇప్పుడు 20వ విడత నిధులు 2025 జూన్ 20వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముందుగానే కొన్ని పనులు పూర్తి చేసుకుంటే నిధుల మంజూరుకు ఎలాంటి ఆటంకం ఉండదు.
ఈనెల 20వ తేదీన 20వ నిధులు మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ రైతులు ముందుగానే కొన్ని పనులు పూర్తి చేస్తే వారి డబ్బులు క్రెడిట్ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు పొందాలంటే బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, సరైన భూ రికార్డులు కూడా కలిగి ఉండాలి.
ఏడాదిలో మూడు దశలో ఈ నిధులు మంజూరు చేస్తారు. కాబట్టి మొదటి దశ ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఉంటుంది. రెండోది ఆగస్టు నుంచి నవంబర్. మూడోది డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో నిధులు క్రెడిట్ అవుతాయి.
పీఎం కిసాన్ అర్హత..
ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అర్హత భారతీయ నివాసి అయి ఉండాలి. వారి పేరుపైన వ్యవసాయ భూమితో పాటు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఇది మాత్రమే కాదు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. అయితే, పన్ను చెల్లింపు దారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హత కాదు.
పీఎం కిసాన్ కి సంబంధించిన డబ్బులు పొందాలంటే ముందుగానే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. దీనికి అధికారిక వెబ్సైట్ అయిన pmisan.gov.in ఓపెన్ చేసి అందులో ఈ కేవైసి ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ చేసి ఉండాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. దీని సబ్మిట్ చేస్తే కేవైసీ పూర్తవుతుంది.ఇది మాత్రమే కాదు మీ బ్యాంక్ ఖాతా కి ఆధార్ లింక్ చేయాలి. లేకపోతే పిఎం కిసాన్ నిధులు మంజూరు కావు.
కిసాన్ బెనిఫిషరీ స్టేటస్..
పీఎం కిసాన్ బెనిఫిషరీ స్టేటస్ కూడా చెక్ చేసుకునే విధానం అందుబాటులో ఉంది. ఇది కూడా pmkisan.gov.in లో ఫార్మర్ కార్నర్ ఓపెన్ చేస్తే బెనిఫిషర్ స్టేటస్ ఉంటుంది. అందులో మీ ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేస్తే బెనిఫిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook