PM Kisan 20th Installment Date Out: కేంద్ర ప్రభుత్వం పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చిందే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. అయితే ఇప్పటివరకు 19 విడుతల్లో ప్రతి ఏడాది రైతుల ఖాతాలో రూ. 6000 జమ చేస్తున్నారు. ఇప్పుడు జూన్ ఈ నెలలోనే 20 విడత నిధులు కూడా మంజూరు కానున్నాయి. అయితే ఏ తేదీన నిధులు మంజూరు అవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేలు.. రూ.2000 చొప్పున మూడు దఫాలో విడుదల చేస్తారు. ఇది రైతుల ఖాతాలో నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా క్రెడిట్ అవుతుంది. అలా ఇప్పటివరకు 19 విడతల్లో నిధులు మంజూరు చేశారు. ప్రధానంగా రైతుల వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయుత అందించడానికి ఈ పథకం ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం.
పీఎం కిసాన్ లో మీ పేరు చెక్ చేసుకునే విధానం..
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ అయిన Pmkisa.gov.in ఓపెన్ చేయాలి. అందులో 'నో యువర్ స్టేటస్' అని హోం పేజీలో క్లిక్ చేయండి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'గెట్ డీటెయిల్స్' పైన క్లిక్ చేయాలి. తద్వారా స్క్రీన్ పైన మీ వివరాలు కనిపిస్తాయి.
పీఎం కిసాన్ యోజన కి మీరు కూడా అర్హత సాధించాలంటే ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి, కేవైసీ ముందుగానే పూర్తి చేసుకోవాలి. అంతేకాదు భూ రికార్డులు కూడా మీ వద్ద కచ్చితంగా ఉండాల్సిందే. ఫిబ్రవరి 24వ తేదీ ఈ ఏడాది 19వ విడుద నిధులు మంజూరు చేశారు. 20వ విడుత నిధులు జూన్ రెండో వారంలో మంజూరు అవ్వనున్నట్లు తెలుస్తోంది .
ఆ పథకం ద్వారా మీరు కూడా లబ్ది పొందాలంటే ఇప్పటివరకు అప్లై చేయకపోతే నేరుగా కామన్ సర్సీస్ సెంటర్ దగ్గరికి వెళ్లే దరఖాస్తు చేసుకోండి. లేకపోతే అధికారిక వెబ్‌సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చు. దీనికి మీ వద్ద ఆధార్ కార్డు, భూ రికార్డులతో పాటు బ్యాంకు వివరాలు ఖాతా వివరాలు కలిగి ఉండాలి. మీ డాక్యుమెంట్లు వెరిఫై చేసిన తర్వాత మీ పేరు ఈ పిఎం కిసాన్ జాబితాలో చేరుస్తారు. తద్వారా ఈ పథకం లబ్ది మీరు కూడా పొందుతారు.
ఇదీ చదవండి: ఒకటో తేదీ బిగ్ గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, ఎంతంటే?
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. జూన్ 1వ తేదీ ఏ రాశుల జాతకం ఎలా ఉంటుంది తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









