PM Kisan 20th Installment: పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు ప్రతి ఏడాది రూ.6 వేల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా పొందుతున్నారు. ఇందులో మూడు విడతల్లో రూ.2000 చొప్పున వారి ఖాతాలో నేరుగా జమా అవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను ప్రతి ఏడాది విడుదల చేస్తారు. అయితే 19వ విడత నిధులను మొన్న ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేశారు. అయితే ఇప్పుడు రానున్నది 20వ విడత నిధులు అవి ఏ నెలలో విడుదలవుతాయి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
19వ విడత నిధుల విడుదలతో ఏకంగా 9.8 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. అయితే ప్రస్తుతం వీరు తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్నారు. 20వ విడుత పీఎం కిసాన్ నిధులు ఏ నెలలో వస్తాయి ఈ పథకం పూర్తి వివరాలు ఇవే..
పీఎం కిసాన్ సమృద్ధి నిధి యోజన 4 నెలలకు ఒకసారి మంజూరు అవుతాయి. 18వ విడత పిఎం కిసాన్ నిధులు 2024 అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయగా ..19వ విడత పిఎం కిసాన్ నిధులు 2025 ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేశారు. అయితే 20వ విడుత నిధులు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు జూన్ నెలలో విడుదల చేస్తారు.
అయితే పీఎం కిసాన్ నిధి యోజన ద్వారా లబ్ది పొందాలంటే రైతులు ముందుగానే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాలి. వారికి మాత్రమే ఈ కిసాన్ నిధులు పడతాయి కొంతమందికి 19వ విడతలో నిధులు మంజూరు కాలేదు. ప్రధాన కారణం కేవైసీ పూర్తి చేసుకోకపోవడం అనే అధికారిక వెబ్‌సైట్లో వెళ్లి నేరుగా ఈకేవైసి పూర్తి చేసుకోవచ్చు. లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్ (CSC) వెళ్తే అక్కడ కూడా ఈ కేవైసీ పూర్తి చేస్తారు
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరోజు నక్కతోక తొక్కే రాశులు ఇవే, మీ రాశి కూడా ఇదేనా?
అయితే అధికారిక వెబ్‌సైట్ pmkisan.in లో మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకునే సౌలభ్యం ఉంది. కేవైసీ పూర్తి చేసుకోవాలంటే రైతుల వద్ద సరైన భూ రికార్డులతో పాటు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. అంతేకాదు కుటుంబంలో కేవలం ఒకరు మాత్రమే ఈ లబ్ది పొందే అవకాశం ఉంది. పిఎం కిసాన్ సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. అప్పటి నుంచి రైతుల ఖాతాలో ప్రతి ఏడాది రూ. 6000 మంజూరు చేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాలోనే ఎలాంటి తప్పులకు ,మోసాలకు తావు లేకుండా ఈ నిధులను మంజూరు చేస్తున్నారు. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఇది వారి వ్యవసాయ ఆర్థిక పెట్టుబడులకు ఎంతగానో ఉపయోగకరం.
ఇదీ చదవండి: రంగుల హోలీ ఆడుతున్నారా? ఇది లేకుంటే నష్టపోతారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









