PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. మరో 3 రోజుల్లో పీఎం కిసాన్‌ రూ.2000 విడుదల..!

PM Kisan 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన 21వ విడత నిధులు విడుదల ఖరార్ అయింది. ఈ నెలలోనే ఆ నిధులు మంజూరు అవుతాయని అధికారులు చెప్తున్నారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మరో మూడు రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Written by - Renuka Godugu | Last Updated : Nov 15, 2025, 09:35 AM IST
PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. మరో 3 రోజుల్లో పీఎం కిసాన్‌ రూ.2000 విడుదల..!

PM Kisan 21st Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ఇప్పటివరకు 20 విడుతలు నిధులు మంజూరు చేశారు. తాజాగా మరో మూడు రోజుల్లో 21వ విడత నిధులు మంజూరు అవుతున్నాయని తెలుస్తోంది. ఈనెల 19వ తేదీ ప్రధాని మోదీ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు 20 విడుదల నిధులు మంజూరయ్యాయి. రూ.3.70 లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లో నిధులు మంజూరు అయ్యాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మంజూరు అవుతాయి. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదయి బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ చేసుకొని ఉండాలి. కేవలం వారికి మాత్రమే ఈ పథకం ప్రయోజనం అందుతుంది.

Add Zee News as a Preferred Source

 ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో రూ. 6000 జమ చేస్తారు. మూడు దశలో రూ.2000 చొప్పున విడుదల చేస్తారు. ఇలా కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన డిజిటల్ ఫిన్‌టెక్‌ టెక్నాలజీలో వంటి కార్యక్రమాలను వేగవంతంగా చేయడానికి సాధ్యం చేశాయి. ఇక ఈ పథకం అర్హత సాధించాలంటే ముందుగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.

 కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్‌ నిధులు వర్తిస్తాయి. అంతేకాదు ఈ కేవైసీ పూర్తిచేసుకుని వారికి పదివేలకు పైగా ఎలాంటి పెన్షన్ తీసుకోకూడదు. అంతేకాదు ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా ఈ పథకం అర్హులు కాదు. ఇక 2019 ఫిబ్రవరి 24వ తేదీన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. pmkisan.in అధికారిక వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

 తాజాగా ఈ నెలలోనే సీఎం కిసాన్ 21వ విడత నిధులు మంజూరు అవుతాయని సమాచారం. ఇప్పటికే 21వ విడత నిధులు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్ వంటి రాష్ట్రాలు విడుదల చేశారు. వరద ప్రభావిత రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ విడుదల చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఈ నెల నవంబర్ 19వ తేదీన 21 విడత పీఎం కిసాన్ నిధులు మంజూరు అవుతాయి.

 ప్రధానమంత్రి కిసాన్ సంబంధిత యోజన ఇకేవైసీ, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కూడా కలిగి ఉండాలి. మీ ఖాతాలో డబ్బులు జమ అయినప్పుడు అలర్ట్ మెసేజ్ వస్తుంది. బ్యాంకుకు వెళ్లి డైరెక్ట్‌ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌ యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేవైసీ ఆన్లైన్ లో చేసుకోవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్ లో కూడా పూర్తి చేస్తారు.

Also Read: పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు దుర్మరణం, 30 మందికి తీవ్రగాయాలు, భయానక దృశ్యాలు..

Also Read:  ఎముకలు కొరికే చలి.. తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 6 డిగ్రీలు నమోదు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News