PM Kisan 21st Installment Released: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) ప్రతి ఏడాది రూ.6000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఇది మూడు దఫాల్లో విడుదల చేస్తారు. దీనికి ముందుగానే ఇకేవైసీ వంటివి పూర్తి చేసుకొని ఉండాలి. అయితే ఇప్పటివరకు 20 విడతల్లో నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడుత నిధుల కోసం రైతుల ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల వరదలు కారణంగా జమ్మూ కశ్మీర్‌లోని వరద ప్రభావిత ప్రాంత రైతులకు ముందుగానే రూ.171 కోట్లు తక్షణ సహాయ ప్యాకేజీని అందించారు. దీంతోపాటు సెప్టెంబర్ 26వ తేదీన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ పీఎం కిసాన్ 21వ విడుత విడుదల చేశారు. మొత్తంగా 540 కోట్లు 2.7 మిలియన్ల పైగా రైతులకు లబ్ధి చేకూర్చింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కొన్ని కోట్ల మంది రైతులు దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పోరాడుతున్న లక్షలాది మందికి తక్షణ సాయంగా మద్దతు ఇస్తుంది. అయితే ఈ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల్లో అతి త్వరలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడుత నిధులు విడుదల కానున్నాయి. అయితే ఈ నిధులు దీపావళి ముందుగానే లేకపోతే అక్టోబర్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.
అయితే రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ముందుగానే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇది కామన్ సర్వీస్ సెంటర్ లేదా pmkisan.org.in అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పూర్తి చేసుకోవచ్చు. దీంతో పాటు మీ ఆధార్ నంబర్ బ్యాంక్‌తో లింక్ చేసి ఉండాలి. మీ భూ రికార్డులు కూడా సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ పనులు పూర్తి చేయని రైతులు 21వ విడుద డబ్బులు పొందలేరు. కాబట్టి తమ స్టేటస్ ను కూడా ఆన్‌లైన్లో చెక్ చేసుకునే సదుపాయం కల్పించారు. అధికారిక వెబ్‌సైట్లో పీఎం కిసాన్ స్టేటస్ ని లబ్ధిదారుల చెక్ చేసుకోవచ్చు.
PM-Kisan Samman Nidhi 21st Installment Released - Over ₹170 crore transferred to 8.5 lakh farmers of Jammu and Kashmir. Government of India continues its unwavering support to farmers'. #AgriGoI #PMKisan #PMKisan21thInstallment #PMKisanSammanNidhi #JammuKashmir pic.twitter.com/XwLzw3WQGA
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) October 7, 2025
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి ఏడాది రూ.6000 నాలుగు నెలలకు ఒకసారి మూడు దఫాల్లో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 20వ విడుత నిధులు దేశవ్యాప్తంగా విడుదల చేశారు. 21వ విడుదల విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇది కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే లభించే పథకం. ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హులు కాదు. చిన్న సన్నకారు రైతులు మాత్రమే లబ్ధి పొందుతారు.
Read more: అదిరిపోయే పోస్టాఫీస్ స్కీమ్.. రూ.755 కడితే చాలు రూ.15 లక్షల బెనిఫిట్, పిల్లల చదువు, పెళ్లికీ బెస్ట్ ప్లాన్!
Read more: నోబెల్ ప్రైజ్ రాకపోవడంతో ట్రంప్ ఏమన్నారో తెలుసా? వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









