)
Prime Minister Modi SPG Commando Salary: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అనేది భారత దేశ ప్రైమ్ మినిష్టర్ ప్రతి నిత్యం కాపాడే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ.1988లో పార్లమెంట చట్టం ద్వారా ఏర్పాటైన SPG ప్రధానమంత్రికి భద్రతను పర్యవేక్షిస్తూ వస్తోంది. ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు సంబంధించిన కమెండోల గ్రూపు. SPG కమాండోలు అప్ గ్రేడెడ్ ఆయుధాలను కలిగి ఉంటారు. ప్రధాని రక్షణ కోసం 3 లెవల్లో వలయంలా ఉంటారు. వీళ్లు ఎల్లపుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తూ ప్రధాని రక్షణ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రధాన మంత్రి వెంట వెళ్లేటప్పుడు ముదురు సన్ గ్లాసెస్ ధరించి ఉంటారు. అంతేకాదు ప్రత్యర్ధులు వీళ్ల ముఖంలో ఎలాంటి ముఖ కవళికలను కనిపించుకుండా భీరంగా ఉండటంలో శిక్షణ పొందుతారు.
SPG కమాండోలు ఉపయోగించే ఆయుధాలలో FN P90 మెషిన్ గన్స్, FN హెర్స్టాల్ F2000 రైఫిల్స్, గ్లాక్ 17 ఆటోమేటిక్ పిస్టల్స్ ఉంటాయి.SPG కమాండో కావడానికి, మీరు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి కనీస విద్యార్హత గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
IPS, CRPF, CISF లేదా ITBP వంటి బలగాల్లో చేరిన తర్వాత అందులో సుశిక్షితులైన వారిని SPGలో అవకాశం కల్పిస్తారు. అందులో అన్ని రకాలుగా ట్రైయిన్ అయిన తర్వాత ప్రధాన మంత్రి భద్రతా విభాగంలో తీసుకుంటారు.భారతదేశంలో, SPG కమాండో యొక్క నెలవారీ జీతం రూ. 84,236 నుండి రూ.2,39,457 వరకు ఉంటుంది. ఒక SPG భద్రతా అధికారి సంవత్సరానికి రూ. 13.2 లక్షల వరకు జీతభత్యాలుంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.