Indian Armed Forces: దేశంలో ఉగ్రవాదంతో అల్లకల్లోలం సృష్టిస్తున్న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం యుద్ధ భేరీ మోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆదేశాలు ఇచ్చారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదం లేకుండా చేస్తామని తెలిపారు. 'భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. పహల్గామ్ దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం, టైమ్ చూసి జవాబిస్తుంది. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం' అని ప్రధాని మోడీ వెల్లడించారు.
Also Read: Pawan Kalyan: 'ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసుకో..!'
ప్రధాన సాయుధ దళంతోపాటు త్రివిద దళాల అధిపతులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతర పరిణామాలపై అంతర్గత భద్రత, సరిహద్దుల్లో పరిస్థితులపై మంగళవారం ప్రధాని మోదీ తన నివాసంలో అత్యున్నత సమావేశం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నావికాదళ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠీ, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు.. డీఏ పెంపుతోపాటు 8 భారీ కానుకలు
ఉగ్రవాదాన్ని అణచివేయాలనేది భారతదేశ సంకల్పం అని ప్రధాని మోదీ తెలిపారు. భారత సాయుధ దళాలపై పూర్తి విశ్వాసం ఉందని.. పహల్గామ్ ఉగ్రదాడిపై దీటైన సమాధానంపై అనుసరించాల్సిన పద్ధతులు, లక్ష్యాలు, సమయాన్ని నిర్ణయించే విషయంలో మీకు (సైన్యానికి) పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు సైన్యానికి ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాలు.. వారికి సహకరిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. వారి (పాకిస్థాన్) ఊహకు అందని రీతిలో చర్యలు ఉండబోతున్నాయని సమావేశంలో జరిగిన చర్చను బట్టి తెలుస్తోంది.
వరుస సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్‌పై ఊహించని రీతిలో దాడి ఉండబోతుందని తీవ్ర చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే ప్రధాని మోదీ కొన్ని రోజులుగా అత్యున్నత సమావేశాలు నిర్వహిస్తున్నారు. రేపు, ఎల్లుండి మరికొన్ని కీలక సమావేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోసారి భద్రతా రంగ కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం సమావేశం కానుంది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానున్నట్లు సమాచారం. వరుస భేటీలు చూస్తుంటే కొన్ని రోజుల్లో పాకిస్థాన్‌పై.. ముఖ్యంగా ఉగ్రవాదంపై భారత సైన్యం తీవ్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









