)
PM Modi In Ayodhya Ram Mandir: ప్రధాని మోదీ అయోధ్య రామ మందిర శిఖరంపై కాషాయ వర్ణ ధర్మ ధ్వజాన్ని ఎగరేశారు. అభిజీత్ ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ధ్వజారోహణ మహోత్సవం ద్వారా శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తైనట్లు సూచించారు. పూజారులు అత్యంత శుభంగా భావించే ఈ సమయానికి పతాకారోహణ నిర్వహించారు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఈ జెండా లంబకోణ త్రిభుజాకారంలో సూర్యుని చిహ్నాన్ని కలిగి ఉంది. శాశ్వత శక్తి, దైవిక తేజస్సు, ధర్మం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ‘ఓం’ చిహ్నంతో చెక్కబడిన జెండాను ఆలయ ‘శిఖర్’ పైన ఉంచారు.
శ్రీరాముడి తేజస్సు, శౌర్యాన్ని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ఈ ధ్వజాన్ని ఎగరేశారు. గర్భగుడిలో బాలరాముడికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, రామ్ జన్మభూమి ట్రస్ట్ సభ్యులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఎన్నో ఏళ్ల సంకల్పం ఈరోజు నెరవేరిందన్నారు. ధ్వజారోహణతో ఎన్నో ఏళ్ల నాటి గాయాలు మానిపోయాయని.. రామమందిర నిర్మాణం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రతి భక్తుడికి నివాళులు అర్పిస్తున్నానని మోదీ అన్నారు. ఎప్పుడైనా సత్యమే గెలుస్తుందన్న మోదీ.. ఈరోజు దేశం, ప్రపంచం మొత్తం రామనామస్మరణతో మార్మోగుతుందన్నారు. శతాబ్దాల బాధ తొలగడంతో భక్తులంతా చాలా సంతోషంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. 500 సంత్సరాలుగా వెలుగుతున్న ఆ త్యాగానికి నేటితో పరిపూర్ణత వచ్చిందన్నారు ప్రధాని.
ఈ కార్యక్రమంతో ఆలయంలోని 44 తలుపులు పూజా ఆచారాల కోసం తెరుచుకున్నాయి. ధ్వజారోహణ కార్యక్రమాన్ని సుమారు 7,000 మంది అక్కడే ఉండి తిలకించారు. గత ఏడాది జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ సీతారాముల కల్యాణం జరిగిన వివాహ పంచమి.
#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat ceremonially hoist the saffron flag on the Shikhar of the sacred Shri Ram Janmbhoomi Temple, symbolising the completion of the temple’s construction.
The right-angled triangular flag, measuring 10 feet… pic.twitter.com/Ip8mATz2DC
— ANI (@ANI) November 25, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.