PM Modi: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ.. భూటాన్ నుంచి రాగానే డైరెక్ట్ ఆసుపత్రికి..!

Delhi Bomb Blast Victims: ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ పేలుడు ఘటనలో 12 మంది చనిపోగా.. 16 మంది గాయపడ్డారు. బాధితులంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Written by - Aruna Maharaju | Last Updated : Nov 12, 2025, 05:39 PM IST
PM Modi: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ.. భూటాన్ నుంచి రాగానే డైరెక్ట్ ఆసుపత్రికి..!

Add Zee News as a Preferred Source

PM Modi Meets Injured Victims: ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి వెళ్లారు. పేలుడు ఘటనలో తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు.

డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అలాగే వారికి అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాని చెప్పారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాగా, ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని తీవ్రంగా స్పందించారు. కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేలుడు ఘటనపై కేంద్ర భద్రతా సంస్థలు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాయి. ఈ దాడికి కారణమైన వారిని వదిలేది లేదు. వారిని తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతాం” అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: Fastest Trains: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 10 రైళ్లు ఇవే.. టాప్‌లో ఏ దేశం ట్రైన్ ఉందంటే..?

Also Read: IPL 2026: ఆ ఆటగాళ్లకి కావ్య పాప గుడ్‌బై.. లిస్ట్‌లో బడా ప్లేయర్స్.. ఎవరు ఉన్నారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News