)
Modi Special Wishes For Ram Charan And Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసనతో కలిసి.. రీసెంట్గా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. అనిల్ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును ప్రధాని మోదీకి అందించారు రామ్ చరణ్ దంపతులు.
మోదీకి విలువిద్య ప్రాముఖ్యతను వివరించిన మెగా కపుల్.. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి రామ్ చరణ్, ఉపాసన దంపతులు శ్రీకారం చుట్టారు. విలువిద్య క్రీడలో ఇంకా చాలా మంది చేరాలని వీరు యువతకి పిలుపునిచ్చారు.
అయితే.. రామ్ చరణ్ దంపతులకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ తెలియజేశారు. ప్రధాని తన ఎక్స్ అకౌంట్లో ‘ రామ్ చరణ్, ఉపాసన, అనిల్ కామినేనిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమిష్టి ప్రయత్నాలు చాలా ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది’ అని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఉపాసనగారిని,అనిల్ కామినేనిగారిని కలవడం ఆనందంగా ఉంది. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్న సమష్టి ప్రయత్నాలు ప్రశంసనీయం. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది.@AlwaysRamCharan @upasanakonidela https://t.co/Al8aYCvy3w
— Narendra Modi (@narendramodi) October 12, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook