PM Modi: కామ్రేడ్ల కంచు కోటలో ఎగిరిన బీజేపీ జెండా.. తిరువనంతపురం ఎన్నికలపై మోదీ సంచలన ట్విట్..

Pm modi on kerala local body polls 2025: తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థి విజయంపై ప్రధాని మోదీ సంచలన ట్విట్ చేశారు. ఇది కేరళ రాజకీయాల్లో కీలక మలుపు అని అభివర్ణించారు. మొత్తంగా దేశంలో తిరువనంతపురం స్థానిక సంస్థల ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 13, 2025, 07:35 PM IST
  • తిరువనంపురంలో చారిత్రాత్మక విజయం..
  • దేశవ్యాప్తంగా సంబరాల్లో బీజేపీ శ్రేణులు..
PM Modi: కామ్రేడ్ల కంచు కోటలో ఎగిరిన బీజేపీ జెండా.. తిరువనంతపురం ఎన్నికలపై మోదీ సంచలన ట్విట్..

Pm modi on Thiruvananthapuram local body election results: కేరళలో జరిగిన తిరువనంతపురం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించింది. ముఖ్యంగా కేరళలోని 14 జిల్లాల్లోని 941 గ్రామ పంచాయతీల్లోని 17,337 వార్డులకు ఎన్నికలు జరిగాయి. దీనితో పాటు 87 మునిసిపాలిటీల్లోని 3,240 వార్డులతో పాటు, ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు చెందిన 421 వార్డులకు రెండు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.  ఈ క్రమంలో తిరువనంతపురంలో బీజేపీ బలపర్చిన అభ్యర్థి, ఐపీఎస్ అధికారిణి ఆర్ శ్రీలేఖ భారీ విజయంను సాధించారు.

Add Zee News as a Preferred Source

 

తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 41వ వార్డు నుండి రాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆమె బీజెపి టిక్కెట్‌పై ఎన్నికల్లో పోటీకి దిగి సీపీఐ-ఎం అభ్యర్థి అమృత ఆర్‌ను 708 ఓట్ల తేడాతో ఓడించారు. దీంతో కామ్రెడ్ల కంచుకోటలో బీజేపీ జెండా పాతినట్లైంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై దేశ ప్రధాని మోదీ సంచలన ట్విట్ చేశారు. తిరువనంతపురంలో ఆర్ శ్రీలేఖ గెలవడంచారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు.

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్‌ను ఓడించడానికి బీజేపీ శ్రేణులు, కార్యకర్తల ప్రభావం ఎంతో ఉందన్నారు. ముఖ్యంగా ఈ గెలుపుతో మరింత జోష్ తో కార్యకర్తలు ముందుకు వెళ్లాలన్నారు. కేరళ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఇదే విషయాన్ని తిరువనంతపురం ప్రజలు విశ్వసించారని అన్నారు. తిరువనంపురం డెవలప్ మెంట్ కు బీజేపీ అన్ని విధాలు పాటు పడుతుందన్నారు.

 మరోవైపు తిరువనంతపురంలో బీజేపీ జెండా ఎగరడంపై  ఎంపీ శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు.

Read more: Mamata Banerjee: కోల్ కతా‌లో హైటెన్షన్.. లియోనల్ మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ..

ఎల్ డీఎఫ్ కంచుకోటలో బీజేపీ జెండా ఎగరడం వారి పాలనకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బైటపెట్టిందన్నారు. అయితే..  మొత్తం 101 వార్డుల్లో బీజేపీ 50 స్థానాల్లో గెలుపొందగా, ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News