PM Modi On Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ.. పాకిస్థాన్‌కు మోదీ లేటెస్ట్ వార్నింగ్..

India attacks on pakistan: భారత్ దాయాది పాక్ ను చావుదెబ్బకొట్టింది. మొత్తంగా బుధవారం అర్ధరాత్రి భారత త్రివిధ దళాలు పాక్ పై విరుచుకుపడ్డాయి.ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ పై తాజాగా.. ప్రధాని మోదీ స్పందించారు. 

Written by - Inamdar Paresh | Last Updated : May 7, 2025, 07:26 AM IST
  • వార్ పై స్పందించిన మోదీ..
  • భారత్, పాక్ ల మధ్య వార్ పీక్స్..
PM Modi On Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ.. పాకిస్థాన్‌కు మోదీ లేటెస్ట్ వార్నింగ్..

Pm Modi Reaction on operation sindoor: జమ్ముకశ్మీర్ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు పాక్ ప్రతీకారం తీర్చుకుంది. మొత్తంగా అందరు అనుకున్నట్లు పాక్ పై మెరుపుదాడులతో విరుచుకుపడింది. బుధవారం అర్దరాత్రి 1.30 నిముషాల ప్రాంతంలో భారత్ త్రివిధ దళాలు  ఆపరేషన్ సిందూర్ తో.. దాయాదిపై విరుచుకుపడ్డాయి.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ ను ప్రధాని రాత్రంత మెళకువగా ఉండి పర్యవేక్షించారు.  ఈక్రమంలో భారత్ త్రివిధ దళాలు రాత్రిపూట.. ముఖ్యంగా పాక్ ఉగ్రవాద స్థావరాలైన.. లష్కరే తోయిబా, జైషేమహ్మద్ లను టార్గెట్ చేసుకుని భారత్ దాడికి పాల్పడింది. మొత్తంగా పాక్ లోని 9 ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ క్రమంలో మోదీ పాక్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

భారత్ జోలికి వస్తే.. భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అంతే కాకుండా..  భారత్ జలాలు , తమ దేశంకోసం మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ పాక్ పై దాడి  నేపథ్యంలో మోదీ త్రివిధ దళాలకు ఇప్పటికే అన్నిరకాలుగా పాక్ పై చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు.

ఇటీవల ప్రధాని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యురిటీ తో వరుస భేటీలు, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోభాల్ తో వరుస భేటిలు జరిగాయి. అయితే.. మొత్తంగా పాక్ ఉగ్రదాడులకు మాత్రం..భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.

Read more: Donald Trump On India Vs Pak: మెరుపుదాడులతో పాకిస్థాన్ నడ్డివిరిచిన భారత్.. ట్రంప్ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే..?

ఇప్పటికే భారత్ పాక్ ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది. మరోవైపు ఈ దాడులతో పాక్.. భారత్ పేరు తల్చుకుంటేనే పాక్ కు తడిసిపోవాలని డైరెక్ట్ అటాక్ చేసింది. పాక్ పై దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్ తో పాటు, భారత్ అంతట హైఅలర్ట్ ప్రకటించారు. ఈక్రమంలో మోదీ ఈరోజు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యురిటీ తో ఈరోజు సమావేశం కానున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News