PM Modi Address To The Nation: 'ఆపరేషన్ సింధూర్'ను మన దేశ ప్రతి అక్కాచెల్లెళ్లు, బిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఉగ్రవాదాన్ని నాశనం చేసే స్వేచ్ఛ సైన్యానికి ఇచ్చినట్లు తెలిపారు. భారత వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ప్రతి పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్.. పాక్‌తో కాల్పుల విరమణ తరువాత జాతిని ఉద్దేశించి తొలిసారి పీఎం మోదీ మాట్లాడారు. పెహల్గామ్ ఘటన తనకు చాలా బాధ కలిగించిందన్నారు. మతం అడిగిన తర్వాత అమాయకులను చంపేశారని ఎమోషనల్ అయ్యారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాని.. ఆపరేషన్ సింధూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన అని అన్నారు.
పీఓకే వదలడం తప్ప పాకిస్థాన్ గత్యంతరం లేదనిన పీఎం మోదీ స్పష్టం చేశారు. కుటుంబం, కన్నబిడ్డల దయ లేకుండా ప్రాణాలు తీశారని.. తనకు వ్యక్తిగతంగా ఎంతో దారుణంగా కనిపించిందని చెప్పారు. భారత్ చర్యతో పాక్ ఉలిక్కిపడిందని.. బహవల్‌పూర్, మురిద్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ చర్యతో తీవ్ర పాక్ నిరాశలో ఉందన్నారు. ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం అయ్యాయని.. ఉగ్రవాదుల ఆత్మలపై సైన్యం దాడి చేసిందన్నారు.
100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టామని.. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందని అన్నారు. ఒకే ఒక్కదాడితో పాకిస్తాన్ బెంబేలెత్తిపోయిందని.. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన పాక్ మనపై ఎదురుదాడి చేసిందన్నారు. స్కూల్స్, ఆసుప్రతులు, గురుద్వార్‌లను టార్గెట్ చేసిందని.. పాక్ ఏ విధంగా వ్యవహరించిందో ప్రపంచమంతా చూసిందని మోదీ అన్నారు.
పాక్ మిస్సైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. పాక్ మిస్సైల్స్ భారత్‌లోకి రాలేకపోయాయని.. కానీ మనం పాక్ గుండెల్లో బాంబులు పేల్చామన్నారు. పాకిస్థాన్‌లోని ఎయిర్‌బేస్‌లకు తీవ్రంగా నష్టం చేశామని.. మన దాడితో పాకిస్థాన్ ఆత్మరక్షణలో పడిందన్నారు. సాయం కోసం ప్రపంచదేశాలను ఆశ్రయించిందని అన్నారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి తెగబడినా భారత్ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలు ఉంటాయని.. పాక్ అణు బ్లాక్ మెయిలింగ్ ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. అణు శక్తి, అణ్వాయుధాల ఆధారంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా భారత్ తుద ముట్టించి తీరుతుందన్నారు.
"భారత్ దాడితో పాకిస్థాన్ భయపడి బతికే దారులు వెతికింది.. మమ్మల్ని కాపాడండి అంటూ ప్రపంచం మొత్తం అడుక్కుంది.. మా చేతిలో దెబ్బ తిన్నాకా.. పాకిస్థాన్ డీజీఎంవో.. మా డీజీఎంవోను సంప్రదించి, మమ్మల్ని వదిలేయండి అని అడుక్కుంది.. కానీ అప్పటి వరకే మేము ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశాం.. ఉగ్రవాదులను ఖండ, ఖండాలుగా చంపి, పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించాం.. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదు.. దేశ ప్రజల భావనల ప్రతిబింబం.. ఆపరేషన్ సింధూర్ న్యాయానికి ప్రతీక.." ప్రధాని మోదీ అన్నారు.
Also Read: Kavitha: రూ.20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లాయి.. కవిత సంచలన ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి