)
Andhra Pradesh Narendra Modi Tour: ప్రధాని మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభ విజయవంతం కోసం మంత్రి లోకేశ్ అధికారులకు సూచనలు చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
1. 16వ తేదీ ఉదయం 7.50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బయలుదేరుతారు.
2. ఉదయం 10.20 గంటలకు కర్నూల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.
3. ఉదయం 11.10 గంటలకు రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు మోదీ చేరుకుంటారు.
4. ఉదయం 11.45కి భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు.
5. మధ్యాహ్నం 1.40 గంటలకు సుండిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు.
6. మధ్యాహ్నం 2.30కు రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
7. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు.
8. సాయంత్రం 4.15 కు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకొని.. సాయంత్రం 4.40 కు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook