PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఛాన్స్‌.. ఇలా రూ.10 లక్షలు పొందే అవకాశం..

PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం అనేక అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజా సంక్షేమం కోసం ఈ పథకాలను అందజేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈరోజు పీఎం ముద్ర యోజన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Apr 11, 2025, 10:57 AM IST
PM Mudra Yojana: కేంద్ర ప్రభుత్వం బంపర్‌ ఛాన్స్‌.. ఇలా రూ.10 లక్షలు పొందే అవకాశం..

PM Mudra Yojana: ప్రధానమంత్రి ముద్ర యోజన (Pradhana mantri Mudra Yojana) ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. సొంతగా బిజినెస్ చేసుకునే వారికి ఇది గొప్ప వరమని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాల్లో ప్రధానమంత్రి ముద్ర యోజన ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పథకం అందుబాటులో ఉంది. అయితే ఈ పథకానికి అర్హత ఏంటి? ఎక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ప్రధానమంత్రి ముద్ర యోజన ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8వ తేదీన ముద్ర యోజన ద్వారా లబ్ధి పొందిన వారితో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో తెలుగు మహిళ కూడా ఆయనతో తెలుగులో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ ముద్ర యోజనకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు ? ఎలా అప్లై చేసుకోవాలి?

ప్రధానమంత్రి ముద్ర యోజన సొంతగా వ్యాపారం ప్రారంభించాలని వారికి ఇది సదవకాశం. లేకపోతే ఉన్న వ్యాపారాలను విస్తరించేందుకు కూడా ఎలాంటి తాకట్టు లేకుండా ఇందులో రుణాలు మంజూరు చేస్తున్నారు.రూ. 10 లక్షల వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నారు. 2015వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు. పది లక్షల వరకు రుణం అందిస్తున్నారు. కానీ ఈ ఏడాది నుంచి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ ముద్ర యోజనలో శిశు, కిషోర్, తరుణ్, తరుణ్ ప్లస్ వంటివి చేర్చారు. శిశు కేటగిరి వరకు రూ.50,000 వరకు రుణాన్ని అందిస్తారు. ఇక రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కిషోర్ కేటగిరి వాళ్లకు అందిస్తారు. తరుణ్ కేటగిరీకి చెందిన వరకు పది లక్షల వరకు ఉచిత రుణాన్ని కల్పించనున్నారు. ఇక తరుణ్ ప్లస్ వాళ్లకు రూ.20 లక్షల వరకు కూడా రుణాన్ని కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం.

మీరు కూడా ప్రధానమంత్రి ముద్ర యోజన ద్వారా లబ్ధి పొందాలంటే మీరు దగ్గర్లోనే ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగా బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌బీఐ లేదా ఎన్‌బీఎస్‌ఎఫ్‌ మైక్రో ఫైనాన్స్ ఆమోదం పొందిన సంస్థల ద్వారా ఈ రుణాలు మంజూరు చేస్తుంది. బ్యాంకు బ్రాంచ్ వెళ్లి అక్కడ మీరు ముద్ర లోన్ కి సంబంధించిన ఫారమ్‌లో మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

READ ALSO:    ఆంటీ మీకూ ఇంట్రస్టింగ్‌ రీల్స్‌ పంపిస్తా: హీరో విజయ్‌ దేవరకొండ..  

READ ALSO:   తహవ్వూర్‌ రాణాకు 18 రోజుల కస్టడీ.. అతని ఫస్ట్‌ ఫోటో ఇదే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News