PM Modi: అల్లు అరవింద్ కుటుంబానికి ప్రధాని పరామర్శ లేఖ.. అల్లు కనకరత్నమ్మకు మోడీ నివాళులు..

PM Narendra Modi tributes to Allu Kanakaratnamma: గత నెల 30న దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈమె మృతిపై సినీ రాజకీయ వర్గాలు తమ సంతాపాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కనకరత్నమ్మ మృతిపై సంతాపం తెలియజేస్తూ అల్లు అరవింద్ ఓ లేఖ పంపించారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 4, 2025, 03:19 PM IST
PM Modi: అల్లు  అరవింద్ కుటుంబానికి  ప్రధాని పరామర్శ లేఖ.. అల్లు కనకరత్నమ్మకు మోడీ నివాళులు..

PM Narendra Modi tributes to Allu Kanakaratnamma: నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ  గత నెల 30వ తేదిన ఉదయం అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పలువురుప్రముఖులు అల్లు అరవింద్ తల్లిగారికి స్వయంగా రాలేని వాళ్లు ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులు అర్పించారు. ఇక నరేంద్ర మోడీ అల్లు అరవింద్ తల్లి గారు.. అల్లు అర్జున్ నాయనమ్మ మృతిపై సంతాపం ప్రకటిస్తూ ఓ లేఖను అల్లు అరవింద్ కుటుంబానికి పంపించారు. ఈ లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ లేఖ విషయాన్ని అల్లు అరవింద్ ఈ రోజు వెల్లడించారు. తమ కుటుంబానికి ప్రధాన మంత్రి సంతాపం ప్రకటిస్తూ లేఖ రాయడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 

Add Zee News as a Preferred Source

ప్రధాని మంత్రి మా కుటుంబంపై చూపిస్తున్న కరుణతో మా తల్లి గారి గొప్పతనాన్ని తెలుపుతూ  లేఖ రాయడాన్ని జీవితంలో మరిచిపోలేనన్నారు. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా తమ కుటుంబానికి సంతాపం తెలపడాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ వివరణ ఇస్తూ లేఖ రాసారు. ఈ లేఖ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.  ప్రధాన మంత్రి .. రీసెంట్ గా జపాన్ తో పాటు చైనా దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే కదా. జపాన్ పర్యటన తర్వాత దాదాపు 7 యేళ్ల తర్వాత గాల్వన్ వంటి సంఘటన తర్వాత డ్రాగన్ కంట్రీలో షాంఘై కో ఆపరేటివ్ సదస్సు కోసం చైనాలో పర్యటించారు.  

అల్లు అరవింద్ విషయానికొస్తే.. ఈయన అల్లు రామలింగయ్య వారసుడిగా నటుడిగా అడుగుపెట్టి.. నిర్మాతగా రాణించారు.  ఆ తర్వాత చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు,  పవన్ కళ్యాణ్ లతో పాటు పలువురు హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అటు కుమారుడు అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. పుష్ప సిరీస్ తో బాలీవుడ్ లో కూడా హీరోగా సత్తా చూపెట్టాడు. ప్రస్తుతం ఇతను అట్లీ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు..! ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..

ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News