PM Narendra Modi: భారత్ లో ప్రముఖ న్యూస్ నెట్ వర్క్ ఛానెల్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో ప్రధాన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గత 11 యేళ్లలో భారత్ సాధించిన విజయాలు.. ఆర్ధిక పురోగతి గురించి చర్చ జరిగింది. ఈ సమ్మిట్ లో ప్రసంగించిన మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు కీ పాయింట్స్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో దేశం సాధించిన విజయాలు.. ప్రపంచ బ్యాంకు, IMF డేటా ప్రకారం, రాబోయే రెండు ఫైనాన్షియల్ ఇయర్స్ లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందన్నారు. ముఖ్యంగా పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వంటి కార్యక్రమాలు.. తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిలో మార్పునకు దారితీస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ.. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ రాము రావు అన్నారు.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం.. అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానన్నారు. . భారతదేశ పురోగతిని ప్రపంచ బ్యాంకు, IMF కూడా అంగీకరిస్తున్నాయని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచం దృష్టంతా నేడు భారత్‌పై ఉందన్నారు. ప్రపంచంలోని ప్రతీ దేశ పౌరుడు ఒక జిజ్ఞాసతో భారత్ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ తన కీలక ఉపన్యాసంలో సమకాలీన రాజకీయాలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు.
భారత దేశం నేడు ఏం ఆలోచన చేస్తోందని హోల్ వరల్డ్ ఆసక్తిగా చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. వల్డ్ ఆర్డర్‌లో భారతదేశం కేవలం పాల్గొనడం మాత్రమే కాదు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, పదిలపరచడంలోనూ తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను ప్రధాని ఉటకించారు. .
వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మైహోం గ్రూప్ ఛైర్మన్ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికగా ఇద్దరూ ఆసీనులయ్యారు. వాట్ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన, అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ మీడియా నెట్‌వర్క్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేసారు.
ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









