PM Modi in Vantara Video: వంతారాలో సింహం, పులి పిల్లల్ని ఆడిస్తున్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్..

Modi playing with lion and tiger cubs: ప్రధాని నరేంద్ర మోదీ జామ్ నగర్ లోని వంతారాలో సింహం, పులి పిల్లల్ని తన ఓడిలో పెట్టుకుని మరీ వాటిని లాలిస్తున్నారు.ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 4, 2025, 02:17 PM IST
  • జామ్ నగర్ లో వంతారాలో మోదీ..
  • జంతువులను దగ్గర నుంచి చూసిన ప్రధాని..
PM Modi in Vantara Video: వంతారాలో సింహం, పులి పిల్లల్ని ఆడిస్తున్న ప్రధాని మోదీ.. వీడియో వైరల్..

PM Narendra modi playing with Lion and tiger cubs in vantara: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవ వేడుకల్లో భాగంగా తన సొంత రాష్ట్రమైన గుజారాత్ లో పర్యటించారు. ఈ క్రమంలో.. సోమవారం రోజు గిర్ అడవుల్లో ఫారెస్ట్ అధికారులతో కలిసి సఫారీ రైడ్ కు వెళ్లారు. అనేక రకాల క్రూర జంతువులను దగ్గర నుంచి చూశారు. సింహలను దగ్గర నుంచి చూసి ఫోటోలు  కూడా తీశారు.

Add Zee News as a Preferred Source

అదే విధంగా ఈ రోజు మోదీ.. జామ్ నగర్ లో ఉన్న వంతారాను సందర్శించారు. వంతారలో ముఖ్యంగా గాయపడిన,  ఇబ్బందుల్లో ఉన్న జంతువులను కాపాడే లక్ష్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ దీన్ని ఏర్పాటు చేశారు. వంతారాను అనంత్ అంబానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తున్నారు.  వంతారను ప్రధాని మోదీ ఈరోజు సందర్శించారు.

 

వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులను మోదీ దగ్గరి నుంచి చూశారు. దీనిలో భాగంగా.. అక్కడున్న సింహలు, పులి పిల్లలను తన ఒళ్ల తీసుకుని మరీవాటిని లాలించారు. ఇంకా అక్కడున్న అనేక జంతువులకు ఆహారం అందించారు. వాటిని దగ్గర నుంచి చూశారు. వంతారాలో వాటిని అందిస్తున్న సదుపాయాల్ని అనంత్ అంబానీ దగ్గరుండి మరీ మోదీకి వివరించారు.  ప్రస్తుతం మోదీ సింహలు, పులి పిల్లలతో ఆడుకున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు.. వంతారాలో..వన్యప్రాణుల ఆస్పత్రిని, స్పెషల్ గా  జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్‌లు, అత్యవసర సేవల విభాగాలను ఏర్పాటు చేశారు.

వంతారా అనేది ఒక కృత్రిమమైన అడవి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లోదీన్ని ఏర్పాటు చేశారు.  ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రికి కూడా ఏర్పాటు చేశారు.

Read more: Modi Wild Photography: సింహాలను ఫోటోలు తీసిన ప్రధాని మోడీ..

ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో దాదాపు 2వేల వన్యప్రాణులను కాపాడుతున్నారు. గిర్ అడవుల్లో సింహల సంఖ్య పెరుగడం పట్ల మోదీ హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు. జంతుజాలాన్ని అంతరించిపోకుండా కాపాడుకావాలని సూచించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News