వ్లాదివొస్టొక్: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. రష్యాలోని వ్లాదివొస్టొక్‌లో జరిగిన ఓ ఫోటో సెషన్‌లో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోదీకి అక్కడి అధికారులు ప్రత్యేక మర్యాదలు చేశారు. భారత ప్రధాని వస్తున్నారు కదా అని ఆయన కోసం వారు ప్రత్యేకంగా ఓ సోఫాను ఏర్పాటు చేశారు.



అయితే, ప్రధాని మోదీ మాత్రం అక్కడ తన కోసం ఏర్పాటు చేసిన సోఫాను సున్నితంగానే తిరస్కరిస్తూ.. మిగతా వారికి ఏర్పాటు చేసినట్టుగానే తన కోసం కూడా ఓ కుర్చీ తీసుకురావాల్సిందిగా సూచించారు. మోదీ కోరిన వెంటనే అక్కడి సిబ్బంది వెంటనే ఓ కుర్చీ తీసుకొచ్చారు. అనంతరం ఆ కుర్చీలో కూర్చుని మిగతా వారితోపాటు మిగతా కార్యక్రమాన్ని పూర్తి కానిచ్చారు.