Narendra Modi Health Secret: ఏడు పదుల వయసు దాటినా కూడా ఇంకా యంగ్‌గా.. భారతదేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిత్యం యవ్వనంగా.. ఉత్సాహంగా కనిపించడం వెనుక తాజాగా ప్రధాని మోదీ రహాస్యం వినిపించారు. తన ఆరోగ్య రహాస్యం వివరించడంతో అందరిలో చర్చ మొదలైంది. తాను ఏడాదిలో 300 రోజులు కేవలం 'ఆ ఆహారం' మాత్రమే తీసుకుంటానని చెప్పడంతో ఏమిటనే చర్చ జరుగుతోంది. ప్రధాని ఆరోగ్యంగా.. నిత్యం ఉత్సాహంగా ఉండడానికి కారణం మఖానా. మఖానా ఏంటి? దాని ప్రయోజనం ఏమిటో ప్రధాని మోదీ మాటల్లోనే తెలుసుకుందాం.
Also Read: YS Sharmila: కొత్త సీసాలో పాత సారా మాదిరి ఏపీ గవర్నర్ ప్రసంగం.. మారని మాజీ సీఎం జగన్ తీరు
బిహార్‌లోని భగల్‌పూర్‌లో సోమవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు విడుదల చేశారు. అంతకుముందు బహిరంగ సభకు హాజరవుతున్న క్రమంలో అక్కడి నాయకులు ప్రత్యేక భారీ దండను వేసి స్వాగతం పలికారు. అయితే ఆ దండ విషయమై తన ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. 'దేశవ్యాప్తంగా చాలామంది ప్రజల అల్పాహారంలో మఖానా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో మఖానా ఉత్పత్తి ఉండాలి' అని ఆకాంక్షించారు.
Also Read: Child Politics In AP: చిన్నారిపై పార్టీల నీచపు రాజకీయం.. ఏపీలో దిగజారిన విలువలు
ఈ సందర్భంగా మఖానా విషయంలో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్యం వెనుక మఖానా ఉందని మోదీ ప్రకటించారు. 'మఖానా సూపర్ ఫుడ్. అది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంది' అని ప్రధాని మోదీ తెలిపారు. '365 రోజుల్లో 300 రోజుల్లో మఖానా నా ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటా' అని వెల్లడించి తన ఆహారపు అలవాటు వివరించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి మఖానా బోర్డు మంజూరు చేసిన విషయం తెలిసిందే. రూ.వంద కోట్లకు మఖానా బోర్డు ఏర్పాటు చేస్తూనే.. ఈ బోర్డు ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడేందుకు.. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు మఖానా బోర్డు సహాయ పడుతుంది. బిహార్‌లో అత్యధికంగా మఖానా పండించే రైతులు మఖానా బోర్డు ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతారు. మఖానా బోర్డు ప్రకటించిన కారణంగా అక్కడి రైతులు, నాయకులు మఖానా దండ వేశారు.
Bhagalpur, Bihar: PM Narendra Modi says, "...Now it's Bihar's Makhana that is in focus. Makhana has become a staple part of breakfast in cities across the country. Speaking personally, I eat makhana on at least 300 out of 365 days a year. It is a superfood that we must now take… pic.twitter.com/Asv83K461e
— IANS (@ians_india) February 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









