PM Modi Sleepless: యుద్ధంపై నిరంతరం సమీక్షలు.. ప్రధాని నరేంద్ర మోదీ నిద్రలేని రాత్రి

PM Narendra Modi Sleepless Night Pakistan Attacks: పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం వేళ తీవ్ర భయాందోళనకర పరిస్థితులు ఏర్పడిన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. గురువారం కూడా నిద్ర పోకుండా భారత సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేస్తూ బిజీబిజీగా ఉన్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 9, 2025, 12:14 AM IST
PM Modi Sleepless: యుద్ధంపై నిరంతరం సమీక్షలు.. ప్రధాని నరేంద్ర మోదీ నిద్రలేని రాత్రి

Pakistan India War: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ఎదురుచూసింది. ఘటన జరిగిన నాటి నుంచి అప్రమత్తమైన భారత ప్రభుత్వం మే 7వ తేదీన తెల్లవారుజామున పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌ గడ్డపై ఉన్న ఉగ్రమూకలను ఏరివేసింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్‌ దాడులకు పాల్పడగా అదే స్థాయిలో భారత సాయుధ దళాలు బదులు ఇస్తున్నాయి. కొన్ని వారాలుగా ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పని చేస్తున్నారు. పాకిస్థాన్‌కు పూర్తి బుద్ధి వచ్చేలా భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టే మే 7వ తేదీన ప్రధాని మోదీ నిద్రలేకుండా గడిపారు. స్వయంగా సమీక్ష చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: India Pakistan War: బిగ్ బ్రేకింగ్‌.. భారత ఆర్మీ అదుపులో పాకిస్థాన్‌ పైలెట్‌

ఆపరేషన్‌ సిందూర్‌ సంఘటన అనంతరం కొన్ని గంటల విరామం తర్వాత గురువారం రాత్రి పాకిస్థాన్‌ చెలరేగింది. జమ్మూతోపాటు రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా తదితర రాష్ట్రాల్లో దాడులకు తెగబడింది. ముఖ్యంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ దాడులు చేసింది. అయితే ఆ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. పూర్తి సన్నద్ధంతో ఉన్న భారత సాయుధ దళాలు వెంటనే ప్రతిస్పందించి పాకిస్థాన్‌ డ్రోన్లు, క్షిపణులను ఎదుర్కొని వాటిని నిర్వీర్యం చేశాయి. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకపోవడం చెప్పుకోదగ్గ విషయం.

Also Read: Jammu Airport: కాల్పులకు తెగబడిన పాకిస్థాన్‌.. దీటుగా తిప్పికొట్టుతున్న భారత ఆర్మీ

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ నుంచి ఈ స్థాయిలో ప్రతిస్పందనను భారత ప్రభుత్వం ఊహించిందే. పాక్‌ను ముందే అంచనా వేసిన భారత సాయుధ దళాలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. ఇక పాకిస్థాన్‌ దాడులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిద్రలేకుండా గడిపారు. భారత సాయుధ దళాలతో నిరంతరం సమీక్షలు చేస్తున్నారు. వారికి కావాల్సిన సలహాలు.. ఏర్పాట్లు చేస్తూ భారత ఆర్మీ పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. ఇక హోం శాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, విదేశాంగ మంత్రి జై శంకర్‌ నిరంతరం సమీక్షలు చేస్తున్నారు.

పాకిస్థాన్‌ దాడులను తిప్పికొట్టడంతోపాటు పాకిస్థాన్‌ను తోక ముడుచుకుని వెళ్లేలా ఇప్పటికే సాయుధ దళాలకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పాకిస్థాన్‌ దాడుల నేపథ్యంలో కూడా ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం రాత్రి కూడా ప్రధాని, మంత్రులు.. సాయుధ దళాలు నిద్రలేని రాత్రి గడుపుతున్నారు. అజిత్‌ ధోవల్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సీడీఎస్‌, త్రివిద దళాలతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ భేటీ అయి తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిరంతరం సమీక్షిస్తున్న ప్రధాని మోదీ
పాకిస్తాన్‌ ప్రతిదాడితోపాటు భారత దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీక్షణంగా గమనిస్తున్నారు. పాకిస్థాన్‌కు సరిహద్దు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం. తీసుకోవాల్సిన భద్రతా చర్యలు.. అప్రమత్తంపై ఆదేశాలు జారీ చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని.. పాకిస్థాన్‌ దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News