
PM Narendra Modi: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ పై భారత్ వైఖరిని వివరించేందుకు భారత దేశం మన దేశంలోని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు పంపించి భారత్ వాదనను వినిపించింది. ఈ సందర్భంగా పర్యటనల వివరాలను ఎంపీలు ప్రధానితో పంచుకున్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత వాదనను బలంగా వినిపించడంపై ఎంపీలను ప్రధానిని అభినందంచారు.
పాకిస్థాన్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై భారత వైఖరిని బలంగా వినిపించిన సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. కాగా ఈ బృందంలో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ లేరు. ఆయన వ్యక్తి గత పనుల నిమిత్తం దుబాయ్ కు వెళ్ళడంతో రాలేదని తెలుస్తోంది.
కాగా వివిధ పార్టీల కు చెందిన 50 మందికి పైగా ఎంపీలు ఏడు బృందాలుగా ఏర్పడి ప్రపంచదేశాల్లో పాక్ వైఖరిని ఎండగట్టారు. 33 దేశాల రాజధానులు, యూరోపియన్ యూనియన్‌లో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. నాలుగు ప్రతినిధుల బృందాలకు ఎన్డీయే ఎంపీలు సారథ్యం వహించారు. మిగిలిన మూడు ప్రతినిధి బృందాలకు విపక్ష ఎంపీలు సారథ్యం వహిచారు. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీ (ఎస్పీ)లు ఒక్కో ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాదనను బలంగా వినిపించారు. ఈ బృందాల్లో మాజీ పార్లమెంటేరియన్లలో కేంద్ర మాజీ మంత్రులు గులాం నబీ ఆజాద్, సల్మాన్ ఖుర్షీద్ వంటి వారు కూడా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook