)
PM Modi Visits Somnath: గుజరాత్‌లోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ దేవాలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దర్శించుకున్నారు. ఆయన అక్కడ సోమనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో మహా కుంభమేళా కోట్లాది మంది దేశ ప్రజల భాగస్వామ్యంతో ముగిసినట్లు ప్రధాని తెలిపారు. ఒక సేవకుడిగా.. మహా కుంభోత్సవం తర్వాత సోమనాథ్ ఆలయానికి వస్తానని అనుకున్నామన్నారు.
ఇందులో భాగంగానే సోమనాథుడిని దర్శించుకొని తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నట్లు తెలిపారు. అనంతరం పొరుగున గల జునాగఢ్ జిల్లాలోని వన్యప్రాణుల అభయారణ్య ప్రధాన కేంద్రం సాసన్‌కు వెళ్లారు. ఈ ప్రాంతం ఆసియా సింహాలకు నెలవై ఉన్న సంగతి తెలిసిందే.
Jai Somnath! pic.twitter.com/niZgFgHRtv
— Narendra Modi (@narendramodi) March 3, 2025
Today, on #WorldWildlifeDay, let’s reiterate our commitment to protect and preserve the incredible biodiversity of our planet. Every species plays a vital role—let’s safeguard their future for generations to come!
We also take pride in India’s contributions towards preserving… pic.twitter.com/qtZdJlXskA
— Narendra Modi (@narendramodi) March 3, 2025
సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నేపథ్యంలో సాసన్లో జరిగే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే సింహాల సందర్శనకు వెళ్తారు. సోమనాథ్ పర్యటనకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జామ్‌నగర్ జిల్లాలోని జంతు రక్షణ, సంరక్షణ, పునరావాసకేంద్రం వన్‌తారాను సందర్శించారు. ముడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం నుంచి మోడీ గుజరాత్లో పర్యటిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe