PM Svanidhi Scheme: చిన్న చిన్న వ్యాపారులు పెట్టుబడుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రుభుత్వం అందిస్తున్న పధకం ఇది. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు ఈ పధకం ద్వారా లబ్ది పొందవచ్చు. మైక్రో ఫైనాన్స్ బారిన పడకుంటే ప్రయోజనం చేకూర్చుకోవచ్చు.
చిన్న చిన్న వ్యాపారులు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మైక్రో ఫైనాన్స్ ద్వారా రుణాలు పొందుతుంటారు. అయితే వడ్డీ రూపంలో భారీగా డబ్బులు పొగొట్టుకుంటారు. ఈ సమస్యను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పేరుతో ఈ పధకాన్ని ప్రారంభించింది. ఏ విధమైన గ్యారంటీ లేకుండా రుణం పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఈ పధకం నుంచి రుణం పొందవచ్చు. అత్యధికంగా 2.5 లక్షల రుణాన్ని తక్కువ వడ్డీకు తీసుకోవచ్చు. పీఎం స్వనిధి పధకంలో రుణం పొందేందుకు గ్యారంటీ, స్యూరిటీ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు రుణం పొందవచ్చు. ఈ పధకాన్ని కోవిడ్ సమయంలో దెబ్బతిన్న చిరు వ్యాపారులకై అందుబాటులో తీసుకొచ్చారు. మొదట్లో ఈ పధకం కింద 10 వేల రూపాయలు రుణం అందించేవారు. తరువాత ఈ రుణం 2.5 లక్షలకు పెరిగింది.
ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, బ్యాంక్ ఎక్కౌంట్ ఉంటే చాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి సులభమైన వాయిదాలలో చెల్లించే విదంగా రుణాలు పొందవచ్చు. తీసుకున్న రుణం సక్రమంగా చెల్లించే కొద్దీ రుణ పరిమితి పెరుగుతుంటుంది. పీఎం స్వనిధి పధకంలో గడువు 12 నెలలు ఉంటుంది. వడ్డీ అనేది రుణ తీసుకునేటప్పుడు నిర్ణయమౌతుంది.
Also read: Income Tax vs Salary Hike: కొత్త ఇన్‌కంటాక్స్ ప్రభావం, పెరగనున్న ఉద్యోగుల జీతాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









