PM Ujjwal Yojana 3.0 Benefits: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద మహిళలకు ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అందిస్తారు. ప్రధానంగా మహిళలకు కట్టెలపై వంట చేయడం వల్ల వచ్చే పొగ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా వాతావరణాన్ని కాపాడాలని లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2025 లో మీరు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారా? ముందుగా అప్లికేషన్ ప్రక్రియను పూర్తిగా తెలుసుకోండి. మీరు కూడా ఈ పథకానికి లబ్ధి పొందుతారు.
ఇక పీఎం ఉజ్వల యోజన 3.0 ద్వారా కలిగే లాభాలు, అర్హత, కావాల్సిన ధృవపత్రాలు, అప్లికేషన్ ప్రక్రియ తెలుసుకుందాం..
పీఎం ఉజ్వల యోజన అంటే ఏంటి?
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం (PM Ujwal Yojana) కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం ఉచితంగా పేద మహిళలకు వారి కుటుంబాలకు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అందించడం. దీంతోపాటు ఒక స్టవ్ కూడా ఉచితంగా అందిస్తారు. సాంప్రదాయ వంట బొగ్గుపై చేయడం వల్ల.. దానిద్వారా పొగ వస్తుంది. దీంతో వారు అనారోగ్యానికి గురవుతారు. అంతేకాదు పొగ కూడా వాతావరణానికి ముప్పు.
పీఎం ఉజ్వల యోజన ప్రధాన లక్ష్యం మహిళల ఆరోగ్యం కాపాడటం.. పొగ వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు ఈ వాతావరణాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడటం. ఉచిత గ్యాస్ అందించటం వల్ల వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి.
ఈ పథకానికి మీరు కూడా అర్హులు కావాలంటే 18 ఏళ్లు పైబడిన పేద మహిళలు అర్హులు. అంతేకాదు వారు దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. రేషన్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి. ఇప్పటికే మీ వద్ద ఎలాంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. ఒకవేళ ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే.. వారి ఆదాయం ఏడాదికి లక్షలోపు ఉండాలి.
ఇక పట్టణ ప్రాంతానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకుంటే వారి కుటుంబ ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పాసు బుక్, నివాస ధ్రువీకరణ పత్రం, మొబైల్ నెంబర్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా కలిగి ఉండాలి.
READ ALSO: తెలంగాణలో ఉగాది కానుక.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
మీరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ 'Apply for news Ujjwala Yojana 2.0' ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.. అందులో మీరు ఐఓసీఎల్, హెచ్ పిసిఎల్ లేదా బిపిసిఎల్ ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోవాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
ఆ దరఖాస్తు ఫారమ్ క్షుణ్ణంగా చదివి అందులో మీ పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సంబంధిత ధ్రువపత్రాలు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వివరాలు క్షుణ్ణంగా చదివిన తర్వాత చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి.
READ ALSO: మైండ్‌బ్లోయింగ్ ఎయిర్‌టెల్ 77 రోజుల ప్లాన్.. రూ.489 ధరలో ఎన్ని లాభాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









