Post Office Scheme: అలాంటి పోస్టాఫీసు పధకం గురించి తెలుసుకుందాం. ఇందులో మీరు నెలకు 2 వేల నుంచి 5 వేల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. మెచ్యూరిటీ అనంతరం ఒకేసారి 3.50 లక్షల పొందే అద్భుత అవకాశం ఉంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం
ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ ఒకేసారి భారీగా నగదు పొందాలంటే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో రిస్క్ జీరో ఉంటుంది. రిటర్న్స్‌పై గ్యారంటీ ఉంటుంది. ముఖ్యంగా నెలకు చిన్న మొత్తంలో అంటే 2 వేలు, 3 వేలు లేదా 5 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ ఒకేసారి భారీగా నగదు పొందవచ్చు. రికరింగ్ డిపాజిట్‌పై పోస్టాఫీసులో 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అనేది సురక్షితమైన గ్యారంటీ లాభాలు ఇచ్చే పథకం. ఇందులో మీరు 100 రూపాయల నుంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించవచ్చు. దీనిపై వార్షిక వడ్డీ 6.7 శాతం లభిస్తుంది. ఇది కాంపౌండ్ వడ్డీ కింద ఉంటుంది. ఈ స్కీమ్ కాలవ్యవధి ఐదేళ్లు ఉంటుంది. ఆ తరువాత వడ్డీతో సహా మొత్తం డబ్బులు డ్రా చేసుకోవచ్చు.
నెలకు 2 వేల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంటే ఐదేళ్లకు మీరు పెట్టిన పెట్టుబడి 1.20 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ 22,732 రూపాయలు కలుపుకుంటే మొత్తం 1,42,732 రూపాయలు అవుతుంది. ఇక నెలకు 3 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే ఐదేళ్లు అది కాస్తా 1.80 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ 34, 097 రూపాయలు కలుపుకుంటే మొత్తం 2,14,097 రూపాయలు పొందవచ్చు.
అదే నెలకు 5 వేల రూపాయల చొప్పున ఐదేళ్లకు 3 లక్షలు అవుతుంది. దీనిపై వడ్డీ 56,830 రూపాయలు కలుపుకుంటే మొత్తం 3 లక్షల 56, 830 రూపాయలు అవుతుంది.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండటంతో ఎలాంటి రిస్క్ ఉండదు. పూర్తిగా సురక్షితం ఇది.
Also read: School Holidays: విద్యార్ధులకు జాక్‌పాట్, మార్చ్‌లో ఐదు రోజులు సెలవులు, జాబితా ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









