Khushbu: ఇష్టం లేని కోర్సు తీసుకున్న బాలిక...కేంద్ర మంత్రికి ఫోన్

Khushbu: బీహార్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని ఖుష్బూను ఆమె తల్లిదండ్రులు సైన్స్‌కు బదులుగా ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకోవాలని బలవంతం చేశారు. సైన్స్ విభాగంలో ఖుష్బూ అడ్మిషన్ ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని విద్యా మంత్రి ఆమెకు ఫోన్‌లో హామీ ఇచ్చారు.

Written by - Bhoomi | Last Updated : Mar 16, 2025, 07:33 PM IST
Khushbu: ఇష్టం లేని కోర్సు తీసుకున్న బాలిక...కేంద్ర మంత్రికి ఫోన్

Khushbu: ఒక్క మార్కు తక్కువగా వచ్చిందన్న కారణంతో తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఇష్టమైన సైన్స్ కోర్సును వదిలేసి ఆర్ట్స్ లో చేరింది ఓ విద్యార్థిని. తన సోదరుల చదువు విషయంలో మాత్రం తల్లిదండ్రులు ఇలాంటి ఆంక్షలేమీ పెట్టలేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్నీటిపర్యంతమైంది. ఈ విషయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వద్దకు చేరింది. దీంతో ఆయన స్పందించారు. 11వ తరగతి చదువుతున్న ఆ బాలికకు ఫోన్ చేశారు. సైన్స్ కోర్సులో చేర్పిస్తానంటూ ఆ బాలికకు భరోసా కల్పించారు. బీహార్ లోని దానాపూర్ కు చెందిన ఖుష్బూ అనే విద్యార్థిని కథ ఇది. 

Add Zee News as a Preferred Source

ఇంటర్య్వూలో ఖుష్బూ వెల్లడించిన వివరాల ప్రకారం..10వ తరగతి పరీక్షల్లో 500కు 400 మార్కులు తెచ్చుకోవాలని ఆమె పేరెంట్స్ చెప్పారు. అయితే 399 ఖుష్బుకు వచ్చాయి. దీంతో తనను సైన్స్ కోర్సు తీసుకోనీయకుండా ఆర్ట్స్ లో చేర్పించారంటూ ఖుష్బూ వాపోయింది. ఇంట్లో తన పట్ల ఎంతో పక్షపాతం చూపుతున్నారంటూ ఆరోపించింది. తన సోదురులు సైన్స్ చదివే అవకాశం లభించిందని..తాను మాత్రం కేవలం ఒక్క మార్కుతో ఇష్టమైన కోర్సుకు దూరమైనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. 

Also Read: Virat Kohli's Retirement: రిటైర్మెంట్ ప్లాన్ పై విరాట్ కోహ్లీ హింట్..కెరీర్​ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్  

ఈ క్రమంలోనే ఖుష్బూకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సైన్స్ విభాగంలో అడ్మిషన్ గురించి దానాపూర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు ఆమెకు తెలిపారు. నచ్చిన సబ్జెక్టు చదువుకునేందుకు ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వాలు మీకు అండగా ఉన్నాయి. ఈ విషయమైన నును ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో మాట్లాడాను. నీట్ కు కూడా ప్రిపేర్ అవ్వండి. డాక్టర్ కావాలనే మీ కలను నెరవేర్చుకోండని కేంద్రమంత్రి ప్రధాన్ ఖుష్బూ కు హామీ ఇవ్వడం విశేషం. 

Also Read:  Gold vs Stock Market:  బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్..భవిష్యత్ లో ఎందులో మంచి రాబడి ఇస్తుంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

...Read More

Trending News