)
Pre Engagement Shoot Video: ఈ కాలంలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకునే ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లి సమయంలో పెద్ద పెద్ద స్క్రీన్ లపై వేసి వధూవరులు బంధువుల ముందు ప్రదర్శిస్తూ ఆనందిస్తారు. అంతేకాదు వెడ్డింగ్ కార్డుతో పాటు బంధుమిత్రుల మొబైల్ ఫోన్స్‌కు ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వీడియో కూడా పంపించేవారు. గతంలో అయితే పెళ్లి జరిగే వరకు వధూవరులను ఒకరిని మరొకరు కలుసుకునే అవకాశం ఉండేది కాదు. పెళ్లి తరువాతే వాళ్లు కలుసుకునేవారు ఇలాంటి తరుణంలో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రెండ్ వచ్చేసింది. ఇది కొంతమందికి నచ్చింది మరికొంతమంది సంప్రదావాదులకు నచ్చలేదు.
ఈ వెడ్డింగ్ ఫోటోషూట్లకు కొండలు, కోనలు, వాగులు వివిధ ప్రముఖ ప్రదేశాలు సందర్శించి వారి పెళ్లికి ముందు గుర్తుగా ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వధూవరులు చేయించుకునేవారు. పంటపొలాల్లో ,చెరువులు, సముద్రం ఇలా ప్రతి ఒక్క ప్రదేశంలో ఫోటోషూట్ చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఇప్పుడు మరింత పరిణితి చెందింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పోటీగా ప్రీ ఎంగేజ్మెంట్ ఫోటోషూట్ కూడా వచ్చేసింది. సోషల్ మీడియాలో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది. పెళ్లికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రెండు మారుతూనే ఉంటుంది. తాజాగా ఈ వీడియో చూసి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫోటో షూట్ లో ఓ హైవే ఖాళీ బ్రిడ్జిపై వైట్ కలర్ ఎస్‌యూవీలు వచ్చి ఆగుతాయి. అందులో నుంచి బౌన్సర్లు ఇరువైపుల కార్ల నుంచి దిగి ఒకరిని ఒకరు చెక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక కారులోంచి అమ్మాయి దిగి నడుచుకుంటూ వచ్చి కారు ముందు నిలబడుతుంది. మరో వైపు ఉన్న కారులో నుంచి కూడా ఒక అబ్బాయి దిగి నడుచుకుంటూ అమ్మాయి వైపు బాన్సర్లతో పాటు వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బాన్సర్ తన వద్దకు సూట్ కేస్ తెచ్చి అబ్బాయికి ఇస్తాడు. దాన్ని ఆ అబ్బాయి అమ్మాయికి ఇస్తాడు. అది ఓపెన్ చేయగా అందులో ఎంగేజ్మెంట్ రింగ్స్, ఎంగేజ్మెంట్ కార్డు ఉంటుంది. అది చూసి అమ్మాయి సిగ్గుపడుతూ అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దీంతో వారు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనికి బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ బిల్లా సినిమాలో నుంచి ఇచ్చారు. సంజయ్ శ్రీజ అనే పేరుపై ఈ ఎంగేజ్మెంట్ వీడియో వైరల్ అవుతుంది. దీని ప్రకారం 2025 ఆగస్టు 14 అంటే ఈరోజు వారు ఎంగేజ్మెంట్ ఫిక్స్.
Just a photoshoot… to announce an engagement ceremony ! pic.twitter.com/eEcL3sDh0I
— Naresh Nambisan | നരേഷ് (@nareshbahrain) August 13, 2025
అయితే ఈ వీడియో చూసి భిన్నంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ అందమైన రోడ్డు ఎక్కడి దబ్బా? అంటూ ఒకరు ప్రశ్నించగా.. మరొకరు ఏపీ అని పెట్టారు. మరికొందరు ఈ రోజుల్లో పెళ్లి అనేది పటిష్టంగా ఉండటం లేదు. పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నామనేది కాదు.. వారి మధ్య బంధం ఎంత బలంగా ఉందనేది ముఖ్యమని రాసుకోచ్చారు. ఈ వీడియో చూసిన మరికొందరు సదరు వధువు లేదా వరుడు కచ్చితంగా ఏ రాజకీయ నేత కుమారుడు లేదా కూతురు అయి ఉంటారు. రిచ్‌గా కనిపిస్తున్నారు అందుకే ప్రమోషన్ కూడా దర్జాగా రోడ్డుపై చేశారు అని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి