)
central govt appoints new governors for 3 states: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మూడు రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్ ల నియామకం చేపట్టింది. గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు.
ఈ నేపథ్యంలో.. మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్ ఘోష్, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది.
ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ఉత్తర్వులు జారీచేశారు. సీనియర్ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా నియామకం పట్ల.. టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అశోక్ గజపతి రాజు ఇప్పటికే మోదీ హాయాంలో.. కేంద్ర పౌరవిమాన యాన మంత్రిగా సేవలందించారు. టీడీపీ పోలిట్ బ్యూరోలో కూడా పని చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ, 2018లో కేంద్ర పదవికి రాజీనామా కూడా చేశారు. గజపతుల రాజ కుటుంబం నుంచి 11వ సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook