Pune Metro rail project: పుణె మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభం.. మెట్రోలో ప్రయాణించిన ప్రధాని..
PM Modi in Pune: పుణె మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. టికెట్టు కొనుగోలు చేసి మరీ మెట్రోలో ప్రయాణించారు.
PM Modi inaugurates Metro Rail Project: పుణె మెట్రో రైల్ ప్రాజెక్టును (Pune Metro rail project) ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ మేరకు పుణె వాసులకు మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. మెుత్తంగా 32.2 కిలోమీటర్లు నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం 12 కిలోమీటర్ల మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అనంతరం ప్రధాని (PM Modi) కియోస్క్ ద్వారా టికెట్టు కొనుగోలు చేసి గర్వేర్ మెట్రో స్టేషన్ నుంచి ఆనంద్ నగర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా సందర్భంగా రైల్లో దివ్యాంగ చిన్నారులతో సంభాషించారు. అంతకుముందు లెహెగావూన్ ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి.. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, రాష్ట్ర మంత్రి సుభాష్ దేశాయ్, దేవేంద్ర ఫడణవీస్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు.
అంతకుముందు మోదీ గర్వారే మెట్రో స్టేషన్‌లో (Garware Metro Station) ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 32.2 కిలోమీటర్ల మేర నిర్మించనున్న పుణె మెట్రో ప్రాజెక్టు కోసం మొత్తం రూ.11,400 కోట్లు వెచ్చించారు. ఈ ప్రాజెక్టుకు 2016 డిసెంబర్ 24న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 32.2 కిలోమీటర్ల దూరం కలిగిన మెట్రో రైల్వే నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 12 కిలోమీటర్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే దూరంగా ఉన్నారు. అంతేకాకుండా పుణె మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మోదీ.
Also Read: Railway Tickets: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ కోసం ఇకపై క్యూ లైన్ అవసరం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook