)
GST Reforms: ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు పదిన్నర గంటలసేపు కొనసాగిన జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. GST సవరణల ప్రకారం ఇక 12%, 28% పన్ను శ్లాబులు ఉండవు. గుట్కా, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22న నవరాత్రి ప్రారంభం నుంచే అమల్లోకి రానున్నాయి. ఒక రకంగా ప్రజలకు ఇది దసరా కానుక అని చెప్పాలి. తలనూనెలు, కార్న్‌ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పతులు, జీవిత బీమా పథకాలు వంటివాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలపై జీఎస్టీ సున్నా. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు-సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించారు. స్లాబుల మార్పు వల్ల రూ.48,000 కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని ప్రభుత్వం చెబుతోంది.
దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా వినియోగం పెంచి.. అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో పండగ సీజన్‌ను మరింత ఉత్సాహభరితంగా మారనుందని భావిస్తున్నారు ఇక వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం.. కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడతెందంటున్నారు. .
ఈ సవరణలు సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరుచుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ మండలి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమన్నారు. ఆమోదించిన మార్పులతో చిన్న వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందన్నారు ప్రధాని మంత్రి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా GST సవరణలతో ప్రజలకు ఉపశమనం కలుగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.