PM Narendra Modi: జూలై 2 నుంచి 8 రోజులు పాటు ప్రధాని మంత్రి విదేశీ పర్యటన..

PM Narendra Modi: ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ  జూలై 2 నుంచి మరోసారి  విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జులై 2 నుంచి  8 రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. బ్రెజిల్‌లోని రియోడీజనిరోలో జరిగే బ్రిక్స్‌ సదస్సులో ఆయన  పాల్గొంటారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 28, 2025, 10:41 AM IST
 PM Narendra Modi: జూలై 2 నుంచి 8  రోజులు పాటు ప్రధాని మంత్రి విదేశీ పర్యటన..

PM Narendra Modi:  ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ముందుగా బ్రెజిల్ లో జరిగే బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత   మోదీ  ఘనా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. మొదటగా జూలై 2, 3వ తేదీల్లో ఆఫ్రికా దేశం ఘనా వెళ్తారు. ఆ దేశంలో ప్రధాని మోదీ మొట్టమొదటి సారిగా పర్యటించనున్నారు. కాగా, భారత్‌ ప్రధాని అక్కడ పర్యటించడం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.  ఘనా నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు వెళ్తారు. అక్కడ జూలై 3, 4వ తేదీల్లో పర్యటించనున్నారు. 1999 తర్వాత భారత ప్రధాని ఒకరు అక్కడికెళ్లడం ఇదే మొదటిసారి. అనంతరం, జూలై 4, 5వ తేదీల్లో అర్జెంటినా వెళ్తారు. జూలై 5 నుంచి 8 వరకు జరిగే 17వ బ్రిక్స్‌ సమిట్‌లో పాల్గొంటారు. 

Add Zee News as a Preferred Source

చివరగా ప్రధాని మోదీ నమీబియా చేరుకుంటారు. నరేంద్ర మోడీ నమీబియాలో పర్యటించే మూడో భారత ప్రధాని గా నిలువనున్నారు. మొత్తంగా ప్రధాని మంత్రి తన విదేశాంగ విధానంలో భాగంగా పలు దేశాల్లో పర్యటిస్తున్నారు.  రీసెంట్ గా ప్రధాని మంత్రి జీ 7 సమావేశాల్లో భాగంగా కెనడా దేశానికి వెళ్లారు. అంతకు ముందు సైప్రస్ తో పాటు క్రొయేషియా దేశాలకు వెళ్లారు. 

మొత్తంగా ప్రధాని మంత్రి తన 11 యేళ్ల పాలనలో మన దేశ ప్రధాన మంత్రులు ఎవరు పర్యటించని ప్రదేశాలకు వెళ్లారు. దీంతో ఆయా దేశాలతో ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన అంశాలపై ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అంతేకాదు పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాల్లో వాణిజ్యంతో పాటు ఇరు దేశాల్లో నేరస్తుతల అప్పగింత కూడా ఉంది. ఇప్పటికే అమెరికాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవూర్ రాణాను మన దేశానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే కదా. త్వరలో మోహుల్ చోక్సీ తో పాటు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లను మన దేశానికి రప్పించే భాగంగా చర్చలు నడుస్తున్నాయి. 

Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !

Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News