'కరోనా వైరస్'ను ఎదుర్కోవడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాభారత యుద్ధం 18 రోజుల్లో పూర్తయింది.. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే మనం 21 రోజులు యుద్ధం చేయాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద పెద్ద మాటలు చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఐతే ఆయన ప్రణాళికలు మొత్తం విఫలమయ్యాయన్నారు.  లాక్ డౌన్ 1.0 తర్వాత 2.0, 3.0  ఆ తర్వాత 4.0.. ఇలా లాక్ డౌన్ లు విధిస్తూనే ఉన్నారని చెప్పారు. కానీ దేశంలో ఇప్పటికీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్నారు. 


ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ సమస్యను తీవ్రంగా తీసుకోవాలని రాహుల్ కోరారు. తాను ప్రభుత్వంపై విమర్శలు చేయదలచుకోలేదని చెప్పారు. ఐతే గతంలో ఏం జరిగిందన్నది పట్టించుకోకుండా..ఇప్పుడు ఏం చేయాలనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచించాలని కోరారు. మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థ.. నానాటికీ జవసత్వాలు కోల్పోతోందన్నారు. దేశంలో నిరుద్యోగిత పెరిగిపోతోందన్నారు. ఇలాంటి సమయంలో ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకెళ్తారో దేశ ప్రజలకు వివరించాలని రాహుల్ కోరారు.   


వలసకూలీల పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉందని రాహుల్ గాంధీ  అన్నారు. ప్రభుత్వంపై వారికి నమ్మకం పోయిందన్నారు. ఓ ఉపాధి లేక.. నిలువ నీడలేక ఇబ్బంది పడుతున్న వలస కార్మికులకు ఆర్ధిక సాయం చేయాలని కోరారు. కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గే వరకు వారికి నెలకు 7 వేల  500 రూపాయల  భృతి కల్పించాలన్నారు.



 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..