MOdi Fitness Secret: ఈ వయస్సులో కూడా ప్రధాని మోదీ అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఎలా ఉంటున్నారు, సీక్రెట్ మంత్ర ఇదే

MOdi Fitness Secret: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ఈ వయస్సులో కూడా దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. చలాకీగా తిరుగుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. చాలామందికి ఆయన ఫిట్‌నెస్ రహస్యం తెలియదు. ఇప్పుడు స్వయంగా ఆయనే తన సీక్రెట్ ఆఫ్ ది ఫిట్‌నెస్ చెప్పేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2025, 08:41 PM IST
MOdi Fitness Secret: ఈ వయస్సులో కూడా ప్రధాని మోదీ అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఎలా ఉంటున్నారు, సీక్రెట్ మంత్ర ఇదే

Modi Fitness Secret: దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ వయస్సు అక్షరాలా 74 ఏళ్లు దాటేసింది. అయినా ఆ వయస్సు ప్రభావం ఆయన కార్యాచరణలో లేదా శారీరక కదలికల్లో ఏమాత్రం కన్పించదు. ఇప్పటికీ ఫుల్ ఫిట్‌గా ఉంటారు. చాలాకాలంగా ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి తెలియక ఎవరికి నచ్చింది వారు విశ్లేషించుకునేవారు. ఇప్పుడు ఆయనే తన ఫిట్‌నెస్ మంత్రమేంటో చెప్పారు. 

Add Zee News as a Preferred Source

ప్రధాని నరేంద్ర మోదీ వయస్సు 74 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ చాలా చలాకీగా ఉంటారు. దేశ విదేశాలు చుట్టి వస్తుంటారు. క్షణం తీరిక లేకుండా పర్యటనల్లో గడుపుతుంటారు. ఈ వయస్సులో కూడా ఇంత చలాకీగా, ఫిట్‌గా ఎలా ఉండగలుగుతున్నారనేది చాలామందికి ఇప్పటి వరకూ తెలియదు. ఇప్పడు ఆయనే స్వయంగా ఆ సీక్రెట్ ఏంటనేది వెల్లడించారు. ఆయన ఫిట్‌నెస్ మంత్ర 50 ఏళ్లుగా పాటిస్తున్న అత్యంత క్రమ శిక్షణతో కూడిన ఉపవాస దీక్ష. ఇటీవల అమెరికన్ పాడ్ కాస్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతా వివరించారు. తన ఉపవాస దీక్ష షెడ్యూల్, అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది స్పష్టం చేశారు. 

ప్రతి ఏటా జూన్ నుంచి మొదలై దీపావళి వరకూ ఉండే చాతుర్మాస ఉపవాసాన్ని తాను తూచా తప్పకుండా ఆచరిస్తానని మోదీ తెలిపారు. ఈ ఉపవాసం 24 గంటలు ఉంటుందని చెప్పారు. అంటే 24 గంటలకు ఒకసారే భోజనం చేస్తారు. ఈ ఉపవాస దీక్షాకాలం ఇండియాలో వర్షాకాలం. ఈ సమయంలో సాధారణంగా జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందని మోదీ అంటున్నారు. 

ఉపవాస దీక్షా సమయంలో తన దినచర్య ఎలా ఉంటుందో వెల్లడించారు. నవరాత్రి సమయంలో అయితే తిండి పూర్తిగా మానేసి కేవలం వేడి నీళ్లు మాత్రమే తాగుతానని చెప్పుకొచ్చారు. ఇక చైత్ర నవరాత్రి సమయంలో అయితే ఒకే రకమైన పండు బొప్పాయి తింటానన్నారు. బొప్పాయి క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బులు దూరమవడమే కాకుండా శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ సహా ఇతర ఎంజైమ్స్ శరీరంపై అత్యంత ప్రభావం చూపిస్తాయని మోదీ వివరించారు. 

ఉపవాసం ఉన్నప్పుడు వాసన, స్పర్శ, రుచి వంటి ఇంద్రియాలు పూర్తిగా సున్నితంగా మారతాయన్నారు. ఉపవాసం అనేది ఒక రకమైన స్వీయ క్రమశిక్షణగా అభివర్ణించారు మోదీ. శారీరకంగానే కాకుండా మానసికంగా ఆధ్యాత్మికంగా పటిష్టం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతి ఏటా తాను పాటించే ఉపవాస దీక్షే తన ఫిట్‌నెస్ మంత్ర అని మోదీ వెల్లడించారు. 

Also read: SC Classification Bill: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం, ఏ కేటగరీలో ఎన్ని ఉప కులాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News