close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బృందావన్‌‌లో ప్రధాని  పర్యటన; భోజనం వడ్డించిన మోడీ

అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ రోజు బృందావన్‌ లో పార్యటించారు

Updated: Feb 11, 2019, 04:48 PM IST
బృందావన్‌‌లో ప్రధాని  పర్యటన; భోజనం వడ్డించిన మోడీ

యూపీ: అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఈ రోజు బృందావన్‌ లో పర్యటించారు . ఇక్కడ ఏర్పాటు చేసిన ‘థర్డ్ బిలియన్త్‌ మీల్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ ... విద్యార్ధులకు  భోజనం వడ్డించారు.  తన స్వహస్తాలతో ఓ విద్యార్ధికి భోజనం తినిపించారు.

దేశం నుంచి ఆకలిని పారదోలడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చేస్తోన్న కృషిని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆకలిని పారదోలడానికి వారు చేస్తున్న కృషి అమోఘం’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిపి 10 వేల  మందికి ఈ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇస్కాన్ స్థాపించిన అక్షయ పాత్ర ఫౌండేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. 

బృందావన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ చంద్రోదయ మందిర్‌ క్యాంపస్‌లో ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మోడీతో  పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ భాజపా ఎంపీ హేమమాలిని తదితరులు పాల్గొన్నారు.