కాన్వాయ్ ఆపి మోడీ మద్దతు దారులకు ఆల్‌ ది బెస్ట్ చెప్పిన ప్రియాంక !!

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది

Last Updated : May 14, 2019, 05:33 PM IST
కాన్వాయ్ ఆపి మోడీ మద్దతు దారులకు ఆల్‌ ది బెస్ట్  చెప్పిన ప్రియాంక !!

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రియాంక ఎన్నికల ప్రచారానికి వస్తోన్న సమయంలో మోదీ... మోదీ’ అంటూ భాజపాకు అనుకూలంగా నినాదాలు చేస్తోన్న మద్దతుదారులు కనిపించారు. ఇది గమనించిన ప్రియాంక  వెంటనే తన కాన్వాయ్ ఆపి వారి వద్దకు వెళ్లి కరచాలనం చేసి ఆశ్చర్యపర్చారు.
 

మీ స్థానంలో మీరు ఉన్నారు, నా స్థానంలో నేను ఉన్నాను. ఆల్‌ది బెస్ట్ అని ఆమె వారితో అన్నారు...ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన భాజపా కార్యకర్తలు వెంటనే తేరుకొని ప్రియాంకకు  ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి  దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ ప్లాట్ ఫాంపై తెగవైరల్ అవుతోంది.

 

Trending News