)
Prostitution In Ranchi: జార్ఖండ్ రాష్ట్రం రాజధాని రాంచీలో ఓ గర్ల్స్ హాస్టల్లో వ్యభిచార దందా నడుస్తోందని తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం స్థానికంగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాంచీలోని లాల్పూర్ అనే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్‌పై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. దీంతో అక్కడ జరుగుతున్న వ్యభిచారం దందా గుట్టు రట్టయింది. ఈ దాడిలో 11 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మంది యువతులు ఉండటం గమనార్హం.
రాంచీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సెక్స్ రాకెట్ వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నడుస్తోంది. యువతులను బుక్ చేసుకొని.. హాస్టల్ నుంచే నేరుగా హోటళ్లకు పంపిస్తున్నట్లు విచారణలో తేలింది. అరెస్టయిన యువతుల్లో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. వీరు కొంతకాలంగా ఇక్కడ ఉంటూ ఈ దందాలో పాలుపంచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యభిచార దందాను నడుపుతున్న వ్యవహారం వెనుక ఉన్న ముఠా నాయకుడు (హ్యాండ్లర్) ఇంకా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో హాస్టళ్ల భద్రత, పర్యవేక్షణ వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలేజీల్లో చదువుకోవాల్సిన యువతులు డబ్బు కోసం ఇలాంటి ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకోవడంపై నెటిజన్లు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విద్యార్థినుల భద్రతకు బాధ్యత వహించాల్సిన ప్రైవేట్ హాస్టల్ యాజమాన్యాల పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. హాస్టల్ యజమానిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని, రాంచీ పరిపాలన అధికారులు నగరంలోని అక్రమ హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ సౌకర్యాలపై నిఘా పెంచాలని నిర్ణయించారు. హాస్టల్ యజమానులు అద్దెకు ఉంటున్నవారికి సంబంధించిన పూర్తి వివరాలను, గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా పోలీసులకు అందించాలని సూచించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. యువతుల దారి మళ్లడానికి కారణమైన పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook