Public Holiday: రేపు అంటే ఫిబ్రవరి 26న మహా శివరాత్రి పండుగ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు పబ్లిక్ హాలిడే ఉంది. అటు స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించారు. మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రేపు అందరికీ సెలవు ఉంది.
ఫిబ్రవరి 26 రేపు బ్యాంకు ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు శుభవార్త. మహా శివరాత్రి పురస్కరించుకుని పబ్లిక్ హాలిడే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు, విద్యాలయాలు మూతపడనున్నాయి. హిందూవులకు మహా శివరాత్రి చాలా ప్రముఖమైన పెద్ద పండుగల్లో ఒకటి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, మిజోరాం, గుజరాత్, జమ్ము కాశ్మీర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే విధంగా దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించారు.
మహా శివరాత్రి రోజున హిందూవులు తమ ఆరాధ్యదైవం శివుని ప్రత్యేక పూజలతో గడుపుతారు. రాత్రి జాగారం చేస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శివాలయాలు భక్తులతో పోటెత్తుతాయి. ఈ రోజున బ్యాంకులకు సెలవు ఉన్నా డిజిటల్ లేదా నెట్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. ఏటీఎంలు పనిచేస్తాయి. యూపీఐ సేవలు కూడా యథావిధిగా పనిచేస్తాయి.
Also read: MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆశావహులు ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









