Public Holidays: స్కూల్, కళాశాల విద్యార్ధులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఏప్రిల్ నెలలో పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ నెలలో భారీగా సెలవులున్నాయి. వరుసగా పండుగలు ఉండటంతో అటు స్కూల్స్, కళాశాలలు, బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఆ సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
ఏప్రిల్ నెల మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చ్ నెల కంటే ఈ నెలలో ఎక్కువ సెలవులున్నాయి. శ్రీ రామనవమి, మహావీర్ జయంతి, బైశాఖి, అంబేద్కర్ జయంతి వంటి సెలవులన్నీ ఏప్రిల్ నెలలోనే ఉన్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల జాబితా ఓసారి పరిశీలిద్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలానే ఏప్రిల్ నెల సెలవుల జాబితా విడుదల చేసింది. బ్యాంకులకు రెండు, నాలుగు శనివారాలు, నాలుగు ఆదివారాలు సెలవులున్నాయి.
ఏప్రిల్ 1 ఒడిశా డే సందర్భంగా ఒడిశాలో సెలవు, జార్ఖండ్‌లో కూడా సెలవు
ఏప్రిల్ 5 బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏపీ, తెలంగాణలో సెలవు
ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా దేశమంతా సెలవు. బ్యాంకులకే కాకుండా స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంది
ఏప్రిల్ 10 మహావర్ జయంతి సందర్భంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సెలవు. బ్యాంకులతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు సైతం సెలవు
ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సెలవు
ఏప్రిల్ 15 హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు
ఏప్రిల్ 19 నాగాలాండ్‌లో సెలవు
ఏప్రిల్ 21 జమ్ము కాశ్మీర్‌లో సెలవు
ఏప్రిల్ 29 గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లో సెలవు
ఏప్రిల్ 30 బసవ జయంతి కర్ణాటకలో సెలవు
Also read: Arogyasri Strike: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









