Public Holidays in April 2025: తెలంగాణలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో 1 నుంచి 9వ తరగతి, డిగ్రీ పరీక్షలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు ఉన్నాయి. పరీక్షల సీజన్ ఓ వైపు, మండుటెండలు ఉన్న తరుణంలో వచ్చే వారం ఏకంగా ఐదు రోజులు స్కూల్స్, కళాశాలలు, ఆఫీసులకు సెలవులు ఉండటం విశేషం.
మార్చ్ నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకూ వరుసగా సెలవులున్నాయి. ఉగాది, రంజాన్‌తో మొదలుకుని ప్రత్యేక రోజుల సెలవులు ఉన్నాయి. కేవలం స్కూల్స్ కళాశాలలే కాకుండా బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు కూడా మూతపడనున్నాయి. మార్చ్ 30న ఉగాది పురస్కరించుకుని అందరికీ సెలవు ఉంది. అయితే ఆదివారం కావడంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఆ తరువాత రంజాన్ పండుగ సెలవులు వరుసగా మార్చ్ 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఉన్నాయి. స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ ఆఫీసులకు మార్చ్ 31, ఏప్రిల్ 1 న సెలవులున్నాయి. ఇక ఏప్రిల్ 5న బాబూ జగజ్జీవన్ రామ్ జయంత్రి సందర్భంగా సెలవు ఉంది. ఈ రోజున విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంది.
ఇక ఆ తరువాత దేశంలోని హిందూవులకు అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి పండుగ ఉంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా అందరికీ సెలవు. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఎలానూ ఉంటుంది.
మొత్తానికి మార్చ్ 30 ఉగాది నుంచి ఏప్రిల్ 6 శ్రీరామనవమి వరకూ పండుగలు, ప్రత్యేక రోజులతో ఐదు రోజులు సెలవులున్నాయి. ఈ ఐదు రోజులూ విద్యా సంస్థలకు సెలవు కాగా నాలుగు రోజులు అందరికీ సెలవు ఉంది. ఇదే నెలలో మరి కొన్ని సెలవులు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 14 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18 గుడ్ ఫ్రైడే సెలవులు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, ఏప్రిల్ 14 తమిళ కొత్త సంవత్సరం ఆప్షనల్ సెలవులున్నాయి. ఇక ఏప్రిల్ 24 నుంచి స్కూల్స్, కళాశాలలకు వేసవి సెలవులు ఉన్నాయి.
Also read: Top 100 List: అత్యంత శక్తివంతమైన టాప్ 100 జాబితా ఇదే, తెలుగు నుంచి ఆ ఒక్కడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









