Public Holidays: మార్చ్ నెల మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్బీఐ మార్చ్ నెల సెలవుల జాబితా విడుదల చేసింది. మార్చ్ నెలలో రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. అందుకే ఆ రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి. మార్చ్ నెలలో హోలీ, ఈదుల్ ఫిత్ర్ లేదా రంజాన్ పండుగలు ఉన్నాయి. ఈ రెండు రోజులు స్కూల్స్ , కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంది.
మార్చ్ నెలలో కీలకమైన పండుగలు ఉన్నాయి. వీటిలో హోలీ, ఈదుల్ ఫిత్ర్ రంజాన్ పండుగలు ఉన్నాయి. హోలీ పురస్కరించుకుని రెండు రోజులు, ఈదుల్ ఫిత్ర్ సందర్బంగా మరో రోజు సెలవు ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు లాంగ్ హాలిడే తీసుకునే అవకాశముంది. ఒక్కరోజు సెలవు పెడితే చాలు వరుసగా ఐదు రోజులు ఎక్కడికైనా ప్లాన్ చేయవచ్చు. మార్చ్ 13వ తేదీన హోలికా దహన్ ఉంటే మార్చ్ 14న హోలీ ఉంది. మార్చ్ 31వ తేదీన రంజాన్ సెలవు ఉంది.
మార్చ్ 13, 4 తేదీల్లో రెండు రోజులు హాలీ సెలవులు ఉన్నాయి. మార్చ్ 15 ఎల్ఐసీ హాలిడే ఉంటే మార్చ్ 16 ఆదివారం సెలవు. ఈ క్రమంలో మార్చ్ 12 ఒక్కరోజు సెలవు పెడితే వరుసగా ఐదు రోజుల సెలవులో ఎక్కడికైనా ప్లాన్ చేయవచ్చు.
Also read: SLBC Tunnel Project: SLBC ప్రాజెక్టు ఎందుకు ఆలస్యమౌతోంది, ఈ ప్రాజెక్టు అవసరమేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









